https://oktelugu.com/

రైతులపై బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

కేంద్ర వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై బీజేపీ నాయకులు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. తాజాగా కర్ణాటక మంత్రి ప్రభు చౌహాన్ యాదగిరి జిల్లాలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ సరహద్దుల్లో చేస్తున్న రైతులు అసలు రైతులు కాదన్నారు. నిజమైన రైతులు తమ భూముల్లో పని చేసుకోవడానికే ప్రాధాన్యతనిస్తారన్నారు. ప్రధాన మంత్రి మోడీ రైతుల కోసమే ఆలోచిస్తున్నారని, దీనిని రైతులు అర్థం చేసుకోవాలన్నారు. అయితే రైతులను మాత్రం కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇటీవల శాసన మండలిలోనూ కాంగ్రెస్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 17, 2020 / 10:42 AM IST
    Follow us on

    కేంద్ర వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై బీజేపీ నాయకులు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. తాజాగా కర్ణాటక మంత్రి ప్రభు చౌహాన్ యాదగిరి జిల్లాలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ సరహద్దుల్లో చేస్తున్న రైతులు అసలు రైతులు కాదన్నారు. నిజమైన రైతులు తమ భూముల్లో పని చేసుకోవడానికే ప్రాధాన్యతనిస్తారన్నారు. ప్రధాన మంత్రి మోడీ రైతుల కోసమే ఆలోచిస్తున్నారని, దీనిని రైతులు అర్థం చేసుకోవాలన్నారు. అయితే రైతులను మాత్రం కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇటీవల శాసన మండలిలోనూ కాంగ్రెస్ నాయకులు రౌడీల విధంగా ప్రదర్శించారన్నారు. అయితే గతంలో బీజేపీ ఎంపీ సన్ని డియోల్ తాను రైతులకు, ప్రభుత్వానికి రెండువైపులా మద్దతిస్తానన్నారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.