న్యాయవ్యవస్థను కూడా రిమోట్‌లా వాడుకుంటున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు.. దేశంలో జడ్జిల బదిలీలు నడుస్తున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది డాలర్ల ప్రశ్నలా మారింది. తెలుగు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను మారుస్తున్నారంటూ ప్రముఖంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు చంద్రబాబు మౌనంగా ఉండటమే అందరిలో అనుమానాలు రేకెత్తిస్తోంది.
Also Read: తిరుపతిపైనే టీడీపీ ఫోకస్
ప్రధానంగా జడ్జిల ట్రాన్స్‌ఫర్స్ నడుస్తున్నాయంటే కీలక నిర్ణయాలన్నీ చంద్రబాబుకు చేరవేసేందుకు ఆయన వేగులు ఢిల్లీ వేదికగా పనిచేస్తుంటాయి. పత్రికలకు మ్యాటర్ తెలియకముందే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తుంటారు. కానీ.. ఈసారి జరిగిన బదిలీల్లో వింత చోటుచేసుకుంది. చంద్రబాబుకు సమాచారం లేకుండానే ఏకంగా పత్రికల వరకూ వెళ్లింది.
అంతేకాదు.. పత్రికల కంటే ముందు సీపీఐ నారాయణ ఈ వ్యవహారంపై రాద్ధాంతం చేశారు. ‘తెలుగు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను మార్చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా లాబీయింగ్ జరుగుతోంది. కేంద్రానికి బేషరతుగా జగన్ మద్దతిస్తున్నందుకు ప్రతిఫలంగా ఈ పనిచేస్తున్నారు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు నారాయణ.
Also Read: జగన్ కు ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
ఇటీవల కేంద్ర హోం మంత్రిని తెలంగాణ సీఎం కేసీఆర్ కలవడం, ఆ తర్వాత సీఎం జగన్ కూడా ఆయనతో భేటీ కావడం, జగన్ ఢిల్లీలో ఉండగానే న్యాయమూర్తుల మార్పుపై వార్తలు రావడం.. వీటన్నిటికీ మధ్య సంబంధం ఏదైనా ఉందా అనేది అనుమానాలు కలిగిస్తున్నాయి. కొలీజియం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నా.. దాని వెనక కేంద్రం సూచనలు, సలహాలు ఉంటాయనేది వాస్తవం. ఈ దశలో కేంద్రం సిఫార్సుతోటే కొలీజియం న్యాయమూర్తుల మార్పుపై నిర్ణయం తీసుకుందా, అలా కేంద్రం సిఫార్సు చేయడం వెనక నిజంగానే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాధినేతల లాబీయింగ్ ఉందా అనేది సస్పెన్స్ గా మారింది. అంతకుమించి చంద్రబాబు ఈ విషయం తెలిసినా ఎందుకు మౌనంగా ఉన్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్