https://oktelugu.com/

భారీగా దిల్ రాజు 50వ జన్మదిన వేడుకలు !

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రేపు 50వ పుట్టినరోజు రోజు జరుపుకుంటున్నారు. 1970 డిసెంబర్ 18న జన్మించిన దిల్ రాజు అర్థ సెంచరీ కొట్టారు. ప్రత్యేకమైన ఈ బర్త్ డేని దిల్ రాజు ఘనంగా జరుపుకోనున్నారు. దీని కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. దిల్ రాజు తన జన్మదిన వేడుకకు స్వయంగా చిత్ర ప్రముఖులను వాట్సాప్ సందేశాలు, ఫోన్స్ చేసి ఆహ్వానిస్తున్నారట. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ నుండి అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారట. ఇక స్పెషల్ […]

Written By:
  • admin
  • , Updated On : December 17, 2020 / 10:47 AM IST
    Follow us on


    స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రేపు 50వ పుట్టినరోజు రోజు జరుపుకుంటున్నారు. 1970 డిసెంబర్ 18న జన్మించిన దిల్ రాజు అర్థ సెంచరీ కొట్టారు. ప్రత్యేకమైన ఈ బర్త్ డేని దిల్ రాజు ఘనంగా జరుపుకోనున్నారు. దీని కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. దిల్ రాజు తన జన్మదిన వేడుకకు స్వయంగా చిత్ర ప్రముఖులను వాట్సాప్ సందేశాలు, ఫోన్స్ చేసి ఆహ్వానిస్తున్నారట. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ నుండి అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారట. ఇక స్పెషల్ అట్రాక్షన్ కోసం కొందరు హీరోయిన్స్ కూడా ఈవేడుకలో సందడి చేయనున్నారని సమాచారం. దిల్ రాజు బర్త్ డే వేడుక ఆయన కూతురి కోసం నిర్మించిన నూతన గృహంలో జరగనుంది. అమెరికాలో ఉంటున్న దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి ఇప్పటికే ఈవేడుక కోసం హైదరాబాద్ విచ్చేసినట్లు తెలుస్తుంది.

    Also Read: నిహారిక గురించి సాయిధరమ్ ఆసక్తికర వ్యాఖ్యలు !

    నైజాం డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టిన దిల్ రాజు… వివి వినాయక్ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో అనేక హిట్ చిత్రాలను దిల్ రాజు నిర్మించారు. దిల్ రాజు బ్యానర్ లో చిత్రం అంటే మినిమమ్ గ్యారంటీ హిట్ అనే టాక్ పరిశ్రమలో ఉంది. స్టార్ ప్రొడ్యూసర్ గా తిరుగులేని ఆధిపత్యాన్ని దిల్ రాజు సాధించారు. ప్రతిభ కలిగిన అనేకమందికి దిల్ రాజు తన బ్యానర్ లో అవకాశాలు ఇచ్చారు. ఒక పక్క చిత్ర నిర్మాతగా ఉంటూనే… నైజాం డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. స్టార్ హీరోల భారీ చిత్రాలకు దిల్ రాజు పంపిణీదారుగా వ్యవహరిస్తున్నారు.

    Also Read: భర్తను కారులో నుండి తోసేసిన ప్రియాంక చోప్రా !

    దిల్ రాజు భార్య అనిత అకాల మరణం తర్వాత ఇటీవలే తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు. తన సొంత ఊరులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి దగ్గరుండి వీరిద్దరి వివాహం చేశారు. దిల్ రాజు, తేజస్వినికి మధ్య 20ఏళ్ల వయసు వ్యత్యాసం ఉండడం గమనార్హం. ఆమె కూడా కథా రచయితగా దిల్ రాజు మూవీ నిర్మాణంలో సహాయం చేయనుందని వార్తలు వస్తున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్