
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై తృణమూల్ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. బీజేపీ నేతలకు పనిపాటా ఏమి లేదని, అందుకే ఎప్పుడూ ఎవరో ఒకరు బెంగాల్‌కు వచ్చి చిచ్చురేపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.