పెద్దాయన సీఎం ఆశలు మాత్రం చావడం లేదుగా..!

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలదొక్కుకునేందుకు నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక రూపంలో ఓ అద్భుత అవకాశం వచ్చింది. కాంగ్రెస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. దీంతో ఈ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి.. ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి చుట్టూనే ప్రస్తుత రాజకీయాలు తిరుగుతున్నాయి. Also Read: బీజేపీ వైపు తెలంగాణ ఉద్యోగ సంఘాల చూపు..!? నల్గొండ జిల్లాలో జానారెడ్డికి 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. అన్ని పార్టీలతో ఆయన […]

Written By: Neelambaram, Updated On : December 10, 2020 7:25 pm
Follow us on


రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలదొక్కుకునేందుకు నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక రూపంలో ఓ అద్భుత అవకాశం వచ్చింది. కాంగ్రెస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. దీంతో ఈ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి.. ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి చుట్టూనే ప్రస్తుత రాజకీయాలు తిరుగుతున్నాయి.

Also Read: బీజేపీ వైపు తెలంగాణ ఉద్యోగ సంఘాల చూపు..!?

నల్గొండ జిల్లాలో జానారెడ్డికి 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. అన్ని పార్టీలతో ఆయన సత్సంబంధాలు ఉన్నాయి. గత ఎన్నికలో జానారెడ్డి నాగార్జున్ సాగర్లో పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహాయ్య చేతిలో సుమారు 7వేల ఓట్లతో ఓటమి చెందారు. ఇటీవల నోముల నర్సింహారెడ్డి మృతి చెందాడంతో త్వరలోనే ఈ స్థానానికి ఉప ఎన్నిక రానుంది. దీంతో అందరిచూపు జానారెడ్డిపై పడింది.

జానారెడ్డి.. అతడి కుమారుడు రఘువీర్ రెడ్డితో  ఇప్పటికే టీఆర్ఎస్.. బీజేపీ నేతలు సంప్రదింపులు చేస్తున్నారు. తమ పార్టీలో వస్తే అసెంబ్లీ సీటు ఇస్తామంటూ ఆఫర్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ జానారెడ్డి సంప్రదింపులు జరిపింది. దీంతో జానారెడ్డి సైతం తాను పార్టీ మారబోయేది లేదని స్పష్టం చేసినట్లు తెల్సింది. అంతేకాకుండా కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తానే సీఎం క్యాండిడేట్ అని చెప్పుకోవడం గమనార్హం.

జానారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానానికి తన మనస్సులోని మాటను ఆయన చెప్పేశారు. ఇక తన స్థాయి ఉన్న నేతలు పార్టీ మారుతున్నట్లు మీడియాలో చూపించడం సమంజసం కాదని మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేశారు. ఇక నాగార్జున్ సాగర్లో తాను పోటీ చేయడం లేదని తన కుమారుడు బరిలో నిలుస్తాడని కాంగ్రెస్ అధిష్టానానికి జానారెడ్డి స్పష్టం చేశారనే ప్రచారం జరుగుతోంది.

Also Read: నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక.. టీఆర్ఎస్ నుంచి బరిలో దిగేది ఎవరు?

జానారెడ్డి వ్యవహారం చూస్తుంటే కాంగ్రెస్ లో తనను సీఎం అభ్యర్థి నిర్ణయిస్తేనే పార్టీలో కొనసాగుతానని లేకపోతే లేదన్నట్లుగా ఉందనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో జానారెడ్డి పలుమార్లు తానే సీఎంనని చెప్పుకునే వారని పలువురు కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవసాన దశలో ఉన్నా.. పెద్దాయన సీఎం ఆశలు మాత్రం చావడం లేదని పలువురు కాంగ్రెస్ నేతలు గొణుక్కుంటున్నారు. దీంతో జానారెడ్డి సీఎం కల ఎప్పటికీ తీరనుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్