https://oktelugu.com/

టేక్ హోం శాలరీలో కోత విధిస్తే ఉద్యోగులకు లాభమా…? నష్టమా..?

కేంద్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుంచి ఉద్యోగుల వేతనాల్లో కోత విధించనున్న సంగతి తెలిసిందే. వేతన నిబంధనల్లో సవరణల వల్ల ఉద్యోగులు ప్రస్తుతం తీసుకునే వేతనంతో పోలిస్తే వచ్చే ఏడాది నుంచి తక్కువ మొత్తం పొందనున్నారు. 2021 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుండగా ఉద్యోగులకు నూతన నిబంధన వల్ల నష్టమో లాభమో అర్థం కావడం లేదు. Also Read: బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. రూ.40,000 వేతనంతో..? కేంద్రం ఇకపై ఆలవెన్స్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 10, 2020 / 06:56 PM IST
    Follow us on


    కేంద్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుంచి ఉద్యోగుల వేతనాల్లో కోత విధించనున్న సంగతి తెలిసిందే. వేతన నిబంధనల్లో సవరణల వల్ల ఉద్యోగులు ప్రస్తుతం తీసుకునే వేతనంతో పోలిస్తే వచ్చే ఏడాది నుంచి తక్కువ మొత్తం పొందనున్నారు. 2021 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుండగా ఉద్యోగులకు నూతన నిబంధన వల్ల నష్టమో లాభమో అర్థం కావడం లేదు.

    Also Read: బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. రూ.40,000 వేతనంతో..?

    కేంద్రం ఇకపై ఆలవెన్స్ ల వాటా 50 శాతానికి మించకూడదని నిబంధనలను మార్చడంతో బేసిక్ శాలరీ 50 శాతంగా ఉండనుంది. దీంతో పీఎఫ్ చెల్లింపులు, గ్రాట్యుటీ పెరుగుతాయి. కంపెనీలు నిబంధనలను అనుగుణంగా వేతనాల్లో మార్పులుచేర్పులు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా టేక్ హోం శాలరీ తగ్గినా మూల వేతనం పెరుగుతుంది. తక్కువ మొత్తంలో వేతనాలు పొందే వాళ్లకు ఈ నిర్ణయం వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయినా ఎక్కువ మొత్తంలో వేతనం పొందేవాళ్లకు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరనుంది.

    Also Read: పరీక్ష లేకుండా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. వారికి మాత్రమే..?

    ఉద్యోగులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల రిటైర్మెంట్ ప్రయోజనాలు భారీగా పెరగనున్నాయి. ఉద్యోగులకు వేతనం తగ్గినా సోషల్ సెక్యూరిటీ పెరుగుతుంది. అయితే ఉద్యోగులకు వేతనం తగ్గినా కంపెనీలకు వ్యయం మాత్రం గతంతో పోలిస్తే భారీగా పెరుగుతుంది. కంపెనీలకు ఖర్చులు 12 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం నిర్ణయం ప్రభావం ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పోలిస్తే ప్రైవేట్ రంగ ఉద్యోగులపై ఎక్కువగా పడుతుంది.

    మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

    నిపుణులు పాత నిబంధనలతో పోల్చి చూస్తే కొత్త నిబంధనలే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తాయని చెబుతున్నారు. ఉద్యోగుల అభిప్రాయ సేకరణ కోసం కేంద్రం ముసాయిదా నిబంధనలను విడుదల చేయగా ఉద్యోగులలో కేంద్రం నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.