
కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులను బలి తీసుకుంటూనే ఉంది. తాజాగా బీహార్‌కు చెందిన జనతాదళ్ (యునైటెడ్)నేత, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కపిల్ డియో కామత్ కరోనాతో మృతి చెందారు. గత కొన్ని రోజుల కిందట ఆయనకు కరోనా సోకడంతో పాట్నాలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో ఉదయం కన్నుమూశారు. ఆయన మృతి ఎంతో బాధకరమని రాష్ట్ర ముఖ్యమంత్రి నితిశ్‌కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.