https://oktelugu.com/

రైతులకు కేంద్రం శుభవార్త.. సులభంగా లక్షా 60 వేల రుణం!

కరోనా, లాక్ డౌన్ ప్రభావం దేశంలోని రైతులపై కూడా పడిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసిన సమయంలో పండించిన పంటను అమ్ముకోలేక రైతులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. మరోవైపు వర్షాలు, వరదల వల్ల గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్, తెలుగు రాష్ట్రాల సీఎంలు రైతులకు ఆదాయం పెంచే దిశగా చర్యలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆదాయం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 16, 2020 / 11:20 AM IST
    Follow us on

    కరోనా, లాక్ డౌన్ ప్రభావం దేశంలోని రైతులపై కూడా పడిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసిన సమయంలో పండించిన పంటను అమ్ముకోలేక రైతులు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. మరోవైపు వర్షాలు, వరదల వల్ల గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్, తెలుగు రాష్ట్రాల సీఎంలు రైతులకు ఆదాయం పెంచే దిశగా చర్యలు చేపడుతున్నారు.

    కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆదాయం పెంచడమే లక్ష్యంగా కొత్త నిర్ణయాలను అమలులోకి తీసుకొస్తోంది. పశు కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ పేరుతో రైతులకు ఆదాయం పెంచడానికి కేంద్రం కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ స్కీమ్ హర్యానా రాష్ట్రంలో అమలవుతుండగా భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ స్కీమ్ అమలయ్యే అవకాశాలు ఉన్నయని తెలుస్తోంది. పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉన్న రైతులు సులభంగా రుణం పొందగలరు.

    హర్యానా సర్కార్ ఇప్పటివరకు రాష్ట్రంలోని 8 లక్షల మంది రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేయగా మరింత మంది రైతులకు కార్డులను అందజేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పశు కిసాన్ క్రెడిట్ కార్డుకు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కోసం ఏ నిబంధనలు అమలులో ఉన్నాయో కిసాన్ క్రెడిట్ కార్డుకు సైతం అవే నిబంధనలు అమలవుతాయి. ఆవులు, గేదెల ద్వారా ఆదాయం పొందే రైతులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

    ప్రజలకు ఈ స్కీమ్ గురించి అవగాహన కల్పించేందుకు బ్యాంకులు సైతం కృషి చేస్తుండటం గమనార్హం. పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ సహాయంతో గరిష్టంగా మూడు లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉండగా 1,60,000 రూపాయల వరకు గ్యారంటీ లేకుండానే రుణం పొందవచ్చు. సమీపంలోని బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకుని రుణం పొందవచ్చు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ స్కీమ్ అమలయ్యే అవకాశాలు ఉన్నాయి.