భారత్ లో కరోనా కేసులు తగ్గినట్లు కనిపిస్తున్నా ప్రజాప్రతినిధులను మాత్రం బలిగొంటుంది. తాజాగా బీహార్ కు చెందిన మంత్రి వినోద్ కుమార్ సింగ్ కరోనా సోకి తగ్గినా ఇతర ఆరోగ్య సమస్యలతో మరణించారు. జూన్ 28న కరోనా బారిన పడ్డ వినోద్ కుమార్ ఆ తరువాత వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే ఇతర ఆరోగ్య సమస్యలు రావడంతో ఢిల్లీలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. మంత్రి సతీమణికి కూడా కరోనా సోకి రికవరీ అయ్యారు. వినోద్ కుమార్ బిహార్లోని కతిహార్ జిల్లా ప్రాణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు.