https://oktelugu.com/

పవన్ సినిమా కోసం భారీ సెట్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా మధ్యలో అగకపోయి ఉంటే షూటింగ్ పూర్తయిపోయి ఎప్పుడో మేలోనే రిలీజ్ అయిపోయి ఉండేది. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు పవన్ చేయాలనుకున్న సినిమాలన్నీ ప్రస్తుతానికి మధ్యలోనే ఆగాయి. మరోపక్క థియేటర్స్ ఓపెన్ అవుతోన్న క్రమంలో మేకర్స్ అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు మొదలుపెట్టేస్తున్నారు. పవన్ కూడా షూట్ లో పాల్గొంటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అది ఇప్పట్లో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. నవంబర్ వరకూ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : October 12, 2020 / 04:43 PM IST
    Follow us on

    pawankalyan

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా మధ్యలో అగకపోయి ఉంటే షూటింగ్ పూర్తయిపోయి ఎప్పుడో మేలోనే రిలీజ్ అయిపోయి ఉండేది. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు పవన్ చేయాలనుకున్న సినిమాలన్నీ ప్రస్తుతానికి మధ్యలోనే ఆగాయి. మరోపక్క థియేటర్స్ ఓపెన్ అవుతోన్న క్రమంలో మేకర్స్ అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు మొదలుపెట్టేస్తున్నారు. పవన్ కూడా షూట్ లో పాల్గొంటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అది ఇప్పట్లో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. నవంబర్ వరకూ ఎలాంటి షూట్స్ వద్దు అని పవన్ చిత్ర యూనిట్ కి తెలిపినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

    Also Read: టీజర్ లో ఎన్టీఆర్ మూడు గెటప్ లు కూడా !

    అయితే ప్రస్తుతానికి రామోజీ ఫిల్మ్ సిటీలో వకీల్ సాబ్ కోసం ప్రత్యేకంగా ఓ భారీ కోర్టు సెట్ వేస్తున్నారు. మరో ముపై రోజుల్లో ఈ సెట్ పని పూర్తికానుంది. ఇక మిగిలిన షూటింగ్ మొత్తం ఫిల్మ్ సిటీలో వేస్తోన్న ఈ సెట్ లోనే పూర్తి చేయనున్నారని సమాచారం. ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందని.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు అలాగే పవర్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్లు స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారని.. ముఖ్యంగా పవన్ కోసం యాక్షన్ సీన్స్ అండ్ సాంగ్స్ యాడ్ చేశారని తెలుస్తోంది.

    Also Read: పూరి-నాగార్జున హాట్రిక్ కొడుతారా?

    కాగా మెయిన్ గా ఈ సినిమా ఓపెనింగే ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఫైట్ మీద ఓపెన్ అవుతుందట. పైగా లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడనున్న తొలి సినిమా ఇదే కావడం.. దానికితోడు తొలి సీన్ కూడా ఫైట్‌ కావడం.. మొత్తానికి పవన్ ఫ్యాన్స్ కి ఈ సినిమా మంచి కిక్ ఇవ్వడం ఖాయం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. సామాజిక సందేశం ఉన్న సినిమాను చేయాలనే ఉద్దేశ్యంతో పవర్ స్టార్ ఈ చిత్రాన్ని ఎంచుకున్నారని.. రీసెంట్ గా ఇచిన ఇంటర్వ్యూలో పవనే చెప్పుకొచ్చాడు.