న్యాయమూర్తులపై వ్యాఖ్యల కేసు సీబీఐకి.. వైసీపీ నేతల్లో కలవరం..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపై సీబీఐ విచారణకు ఆదేశించింది న్యాయస్థానం. గతంలో ఏపీ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై హైకోర్టు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై స్పీకర్ తమ్మినేని, మంత్రి కొడాలి నాని, మాజీ ఎంఎల్ఏ ఆమంచి సహా పలువురు వైసీపీ నేతలు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో హైకోర్టు సబ్ రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు మేరకు కొందరు వ్యక్తులపై సీఐడీ కేసులు […]

Written By: Suresh, Updated On : October 12, 2020 4:03 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపై సీబీఐ విచారణకు ఆదేశించింది న్యాయస్థానం. గతంలో ఏపీ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై హైకోర్టు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై స్పీకర్ తమ్మినేని, మంత్రి కొడాలి నాని, మాజీ ఎంఎల్ఏ ఆమంచి సహా పలువురు వైసీపీ నేతలు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో హైకోర్టు సబ్ రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు మేరకు కొందరు వ్యక్తులపై సీఐడీ కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసుల్లో పురోగతి లేదని హైకోర్టు సబ్ రిజిస్ట్రార్ మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించింది.