
భారత జట్టును రెండేళ్లుగా గాయాల బెడద వెంబడిస్తుంది. అయితే యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సమయంలో గాయపడిన ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మరో ఆరు నెలలు ఆటకి దూరంగా ఉండబోతున్నాడు. అయితే వచ్చే జనవరి 10 నుంచి ప్రారంభంకానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కోసం ఉత్తర్‌ప్రదేశ్ జట్టు సెలెక్షన్ కమిటీ.. భువీ ఫిట్‌నెస్‌ను తాజాగా పరిశీలించింది. అతను కనీసం ఆరు నెలలు ఆటకి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారట. దీంతో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. అయితే గాయం కారణంగా భారత్ వేదికగా ఇంగ్లాండ్‌తో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న సుదీర్ఘ సిరీస్‌కి కూడా భువనేశ్వర్ కుమార్ దూరంగా ఉండబోతున్నాడు.