https://oktelugu.com/

విశాఖలో తీవ్ర ఉద్రిక్తత: టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీ

విశాఖలో టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య వార్ మొదలైంది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించడం ఈ వివాదానికి కారణమైంది. దీంతో నేతలు ప్రతిజ్ఞలంటూ అనుచరులతో కలిసి సాయిబాబా గుడిలో తేల్చుకోవాలని బయలు దేరడంతో రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో విశాఖలో రాజకీయ వేడి మరోసారి రగులుకుంది. Also Read: పనిలో ఉన్నప్పుడు తాగొద్దు.. అధికారులపై నోరుజారిన మంత్రి […]

Written By:
  • NARESH
  • , Updated On : December 26, 2020 / 06:49 PM IST
    Follow us on

    విశాఖలో టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య వార్ మొదలైంది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించడం ఈ వివాదానికి కారణమైంది. దీంతో నేతలు ప్రతిజ్ఞలంటూ అనుచరులతో కలిసి సాయిబాబా గుడిలో తేల్చుకోవాలని బయలు దేరడంతో రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో విశాఖలో రాజకీయ వేడి మరోసారి రగులుకుంది.

    Also Read: పనిలో ఉన్నప్పుడు తాగొద్దు.. అధికారులపై నోరుజారిన మంత్రి ఎర్రబెల్లి

    విజయసాయి రెడ్డి విమర్శలు నిజం కాదని తాను సాయిబాబా గుడిలో ప్రమాణం చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి బయలు దేరారు. తనపై చేసిన ఆరోపణలపై సాయిబాబా ఆలయంలో వైసీపీ నేతలు ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే వెలగపూడి సవాలు విసిరారు. సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేయడానికి ఇరుపక్షాలు భారీగా తరలిరావడంతో విశాఖలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయం వద్ద కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.

    విజయసాయిరెడ్డికి బదులుగా వైఎస్సార్‌సీపీ నుంచి విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ విజయనిర్మల వచ్చి సాయిబాబాను దర్శించుకున్నారు. ఆ తర్వాత వెలగపూడి కార్యాలయం వైపు వైఎస్సార్‌సీపీ నేతలు సాయిబాబు ఫోటో తీసుకెళ్లారు. ఎంవీపీ కాలనీ మెయిన్ రోడ్డు దగ్గర విజయ నిర్మలను పోలీసులు అడ్డుకున్నారు.. అనుమతి లేదన్నారు. దీంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు.

    Also Read: పీసీసీ రేసులో పవన్ కల్యాణ్.. సంచలన కామెంట్స్ చేసిన వీహెచ్..!

    వైఎస్సార్‌సీపీ నిరసనపై ఎమ్మెల్యే వెలగపూడి స్పందించారు. వైఎస్సార్‌సీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని సవాల్ చేశారు. తాను ఎంపీ విజయసాయిరెడ్డిని రమ్మన్నానని.. ఆయన వస్తే ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తామన్నారు. దీంతో విశాఖలో టీడీపీ, వైసీపీ ఫైట్ ఉద్రిక్తతలకు దారితీసింది.

    విశాఖ పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా గుడి వద్ద మూడంచెల పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయం వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్