Best flights : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక అతను తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. విదేశీయులను పంపించేందుకు తీసుకుంటున్న చర్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక అమెరికాలో ఇతర దేశాలపై విధిస్తున్న ఆంక్షలు అక్కడ ఉన్నవారిని భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లాలనుకునేవారు తగ్గిపోతున్నారు. ప్రత్యామ్నాయ దేశాలు చూసుకుంటున్నారు. ఈ తరుణంలో అమెరికా కొత్తగా విద్యార్థి వీసాలు జారీ చేసింది. దీంతో కొంత మంది అమెరికాకు సిద్ధమవుతున్నారు. అలాంటి వారికి వివిధ విమానయాన సంస్థలు విమానాలు నడుపుతున్నాయి.
అమెరికా ప్రయాణం ఒక సవాల్..
అమెరికాకు మొదటి విమాన ప్రయాణం ఒక సవాల్‌తో కూడిన అనుభవంగా ఉంటుంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు, వీసా జాప్యం, సామాను పరిమితులు, బడ్జెట్ సమస్యలు వంటి అంశాలు ఒక్కొక్కటిగా ఎదురవుతాయి. ఖతర్ ఎయిర్‌వేస్, ఎమిరేట్స్, ఎతిహాద్ ఎయిర్‌వేస్ వంటి విమానయాన సంస్థలు విద్యార్థుల కోసం ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి. కానీ, సామాను అనుమతులు, రాయితీలు, షెడ్యూల్ సౌలభ్యం, ప్రయాణ సమయం వంటి అంశాల ఆధారంగా ఈ ఆఫర్లలో ఏది అనుకూలంగా ఉంటుందో దానిని ఎంచుకోవాలి.
Also Read: వెంకటేష్ చేయాల్సిన సూపర్ హిట్ సినిమాను పవన్ కళ్యాణ్ చేశాడా..?
ఎతిహాద్ ఎయిర్‌వేస్..
విద్యార్థులకు సామాను అనుమతి అత్యంత కీలకం. పాఠ్యపుస్తకాలు, శీతాకాల దుస్తులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు వంటివి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో ఎతిహాద్ ఎయిర్‌వేస్ ముందంజలో ఉంది. ఎకానమీ క్లాస్‌లో 2 బ్యాగులు (ఒక్కొక్కటి 23 కిలోలు) అనుమతిస్తుంది, ఇది విద్యార్థులకు అద్భుతమైన ఎంపిక. అదనంగా, కొన్ని రూట్‌లలో 10 కిలోల అదనపు సామాను అనుమతి ఉంది. కానీ అమెరికా/కెనడా రూట్‌లకు ఈ అదనపు సామాను వర్తించదు.
ఎమిరేట్స్ ఎయిర్‌వేస్..
సాధారణంగా 30-35 కిలోల సామాను అనుమతిస్తుంది, కొన్ని రూట్‌లలో 10 కిలోల అదనపు సామాను లేదా ఒక అదనపు బ్యాగ్ అనుమతి ఉంది, కానీ అమెరికా/కెనడా రూట్‌లకు స్టాండర్డ్ అనుమతులు వర్తిస్తాయి.
ఖతర్ ఎయిర్‌వేస్..
విద్యార్థులకు 10 కిలోల అదనపు సామాను లేదా ఒక అదనపు బ్యాగ్ అనుమతి ఉంది, కానీ ఇది రూట్‌పై ఆధారపడి ఉంటుంది.
సామాను అవసరాలు ఎక్కువగా ఉన్న విద్యార్థులకు ఎతిహాద్ ఉత్తమ ఎంపిక. ఎమిరేట్స్, ఖతర్ కూడా మంచి ఆఫర్లను అందిస్తాయి, కానీ ఎతిహాద్ రెండు 23 కిలోల బ్యాగులు అనుమతించడం ద్వారా ఆకర్షణీయంగా నిలుస్తుంది.
రాయితీలు ఇలా..
ఇక విమాన టికెట్ ధరలు విద్యార్థుల బడ్జెట్‌లో ముఖ్యం.
ఎతిహాద్ ఎయిర్‌వేస్‌తోపాటు ఎమిరేట్స్, ఖతర్ ఎయిర్‌వేస్ కూడా రాయితీలను అందిస్తాయి, కానీ శాతం, షరతులు వేర్వేరుగా ఉంటాయి. ఎమిరేట్స్ ఎకానమీ క్లాస్‌లో 10% రాయితీ, బిజినెస్ క్లాస్‌లో 5% రాయితీ అందిస్తుంది. స్టూడెంట్ ప్రోమో కోడ్‌తో బుక్ చేయాలి. ఈ రాయితీలు మార్చి 31, 2026 వరకు చెల్లుతాయి. ఎతిహాద్.. ఎకానమీ క్లాస్‌లో 10% రాయితీ, బిజినెస్ క్లాస్‌లో 5% రాయితీ అందిస్తుంది. ఈ ఆఫర్ జూన్ 30, 2025 వరకు చెల్లుతుంది. విద్యార్థి గుర్తింపు కార్డు లేదా యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ అవసరం. ఖతర్ ఎయిర్‌వేస్.. Ü్టూడెంట్ క్లబ్ ద్వారా 10-20% రాయితీ అందిస్తుంది, కానీ రాయితీ శాతం రూట్, బుకింగ్ సమయంపై ఆధారపడి ఉంటుంది. అదనంగా, ప్రాయారిటీ బోర్డింగ్, లాంజ్ యాక్సెస్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
Also Read: కెరియర్ స్టార్టింగ్ లో ప్రశాంత్ నీల్ ను రిజెక్ట్ చేసిన మెగా హీరో…
షెడ్యూల్ సౌలభ్యం..
వీసా జాప్యం విద్యార్థులకు సాధారణ సమస్య. ఈ సందర్భంలో ఫ్లైట్ టికెట్ మార్పిడి సౌలభ్యం కూడా విద్యార్థులకు కీలకం. ఎమిరేట్ ఫ్లెక్స్, ఫ్లెక్స్ ప్లస్ టికెట్‌లలో ఉచిత తేదీ మార్పిడి అందిస్తుంది, సేవర్ టికెట్‌లకు రూ.50 ఫీజు వసూలు చేస్తుంది. ఎతిహాద్ ఒక ఉచిత తేదీ మార్పిడి అనుమతిస్తుంది, ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఖతర్ ఎయిర్‌వేస్ స్టూడెంట్ క్లబ్ సభ్యులకు సౌలభ్యమైన తేదీ మార్పిడి ఆఫర్ ఉంది, కానీ షరతులు రూట్‌పై ఆధారపడతాయి.
ప్రయాణ సమయం..
ప్రయాణ సమయం, లేఓవర్‌లు విద్యార్థులకు జెట్‌లాగ్‌ను ప్రభావితం చేస్తాయి. ఖతర్ ఎయిర్‌వేస్.. దోహా హబ్ ద్వారా వేగవంతమైన కనెక్షన్‌లు, తక్కువ లేఓవర్ సమయం అందిస్తుంది, ఇది జెట్‌లాగ్‌ను తగ్గిస్తుంది. ఎమిరేట్స్ దుబాయ్ హబ్ ద్వారా కనెక్షన్‌లు మంచివి, కానీ లేఓవర్ సమయం రూట్‌పై ఆధారపడి ఎక్కువగా ఉండవచ్చు. ఎతిహాద్ అబుదాబి హబ్ ద్వారా కనెక్షన్‌లు సమర్థవంతంగా ఉంటాయి, కానీ ఖతర్‌తో పోలిస్తే కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు.