https://oktelugu.com/

మరోసారి పెరిగిన వంట గ్యాస్ ధర: 15 రోజుల్లో రూ.100 పెంపు

సామాన్యులపై మరో పిడుగు పడింది. గత కొన్ని రోజుల కిందట రూ.50 పెరిగిన వంట గ్యాస్ ధర తాజాగా మరో రూ.50 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్  తెలిపింది. 15 రోజుల వ్యవధిలో రూ.100 పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.649కి చేరింది. డిసెంబర్ 2 కు ముందు హైదరాబాద్ లో సిలిండర్ ధర రూ.646.50 గా ఉండగా రూ. 50 పెంచారు. దీంతో రూ.696.50గా మారింది. తాజాగా రూ.50 […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 15, 2020 / 12:48 PM IST
    Follow us on

    సామాన్యులపై మరో పిడుగు పడింది. గత కొన్ని రోజుల కిందట రూ.50 పెరిగిన వంట గ్యాస్ ధర తాజాగా మరో రూ.50 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్  తెలిపింది. 15 రోజుల వ్యవధిలో రూ.100 పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.649కి చేరింది. డిసెంబర్ 2 కు ముందు హైదరాబాద్ లో సిలిండర్ ధర రూ.646.50 గా ఉండగా రూ. 50 పెంచారు. దీంతో రూ.696.50గా మారింది. తాజాగా రూ.50 పెరగడంతో రూ. 750కి చేరింది. అయితే రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో సిలిండర్ ధరల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. పెరిగిన ధరలతో హైదరాబాద్లో రూ.750 కాగా, వరంగల్ లో రూ.765, కరీంనగర్ లో రూ.766 గా నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో రూ.700 ఉండగా తిరుపతిలో రూ.730గా చూపిస్తోంది. ఏదీ ఏమైన సిలిండ్ ధర ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.