https://oktelugu.com/

హిట్ లేకపోయినా బిజినెస్ బాగుంది !

మాస్ మహా రాజా రవితేజకి హిట్ వచ్చి చాలకాలం అయిపోయింది. అందుకే ఇప్పుడు ఆయన ప్రస్తుతం చేస్తోన్న ‘క్రాక్’ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అయితేనే.. రవితేజ కెరీర్ ఉంటుంది. ఇంకా ఎన్నాళ్ళు హీరోగా కొనసాగుతాడో అనేది డిసైడ్ అయ్యేది కూడా క్రాక్ రిజల్ట్ ను బట్టే. అందుకే, రవితేజ కూడా క్రాక్ సినిమా హిట్ అవ్వాలని మొదటి నుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ రీషూట్ లు మీద రీషూట్ లు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2020 / 12:51 PM IST
    Follow us on


    మాస్ మహా రాజా రవితేజకి హిట్ వచ్చి చాలకాలం అయిపోయింది. అందుకే ఇప్పుడు ఆయన ప్రస్తుతం చేస్తోన్న ‘క్రాక్’ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అయితేనే.. రవితేజ కెరీర్ ఉంటుంది. ఇంకా ఎన్నాళ్ళు హీరోగా కొనసాగుతాడో అనేది డిసైడ్ అయ్యేది కూడా క్రాక్ రిజల్ట్ ను బట్టే. అందుకే, రవితేజ కూడా క్రాక్ సినిమా హిట్ అవ్వాలని మొదటి నుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ రీషూట్ లు మీద రీషూట్ లు చేస్తూ.. చాల కష్టపడుతున్నాడు. మరి ఇంతలా జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తోన్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా ఎలా ఉన్నా ఈ సినిమాకి బాగానే గిట్టుబాటు అవుతుంది.

    Also Read: ‘అక్కినేని నాగార్జున’ను వెంటాడుతోన్న బాధ !

    నిజానికి మాస్ రాజా గ‌త సినిమాల ప్ర‌భావం ఏమీ లేకుండా క్రాక్‌ కు ఈజీగానే బిజినెస్ అయిపోయేలా ఉందని తెలుస్తోంది. థియేట‌ర్లు పూర్తి స్థాయిలో న‌డవ‌డం మొద‌ల‌య్యాక మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేస్తారట. మరి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తే.. మాస్ రాజా మ‌ళ్లీ గాడిలో ప‌డిపోయిన‌ట్లే. మరి చూడాలి రవితేజకి ఎలాంటి హిట్ వస్తోందో. ఇక రవితేజ క్రాక్ తరువాత ఏ సినిమా చేయాలి… ఏ డైరెక్టర్ తో సినిమా చేయాలి అనే మీమాంసలో ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ డేట్స్ కోసం త్రినాధ్ రావ్, రమేష్ వర్మ ఎదురు చూస్తున్నారు.

    Also Read: పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సరికొత్త రికార్డ్ !

    దర్శకుడు రమేష్ వర్మ సినిమా అయితే రెండు మూడు నెల్లల్లోనే పూర్తి అవుతుంది కాబట్టి.. దాదాపు రమేష్ వర్మకే రవితేజ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇక క్రాక్ కథ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులకి బాగా ఆసక్తి ఉందట. కాగా ఈ సినిమా కథ ఇద్దరి భార్యల మధ్య నడిచే ఎమోషనల్ యాక్షన్ డ్రామా అట. ఈ సినిమాలో రవితేజ సరసన మెయిన్ హీరోయిన్ శ్రుతి హాసన్ నటిస్తోంది. అయితే వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా రవితేజ సరసన మరో హీరోయిన్ గా ఆడిపాడనుంది. ఏది ఏమైనా రవితేజ టైం ప్రస్తుతం అసలు బాగాలేదు. ‘డిస్కో రాజా’ సినిమా రవితేజ మార్కెట్ పై బాగా దెబ్బ వేసిందట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్