https://oktelugu.com/

వృద్ధాశ్రమంలో అగ్ని ప్రమాదం : 11 మంది సజీవ దహనం

వృద్ధాశ్రమంలో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది బలైన ఘటన రష్యాలో చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున 3 గంటలకు ఈ ఘటన జరగడంతో తీవ్ర విషాదం నెలకొంది. రష్యాలోని బాష్కోర్టోస్టాన్ ప్రాంతంలోని ఉరల్ పర్వత శ్రేణుల్లో ఉన్న ఓ ఆశ్రమంలో వృద్ధులు నివసిస్తున్నారు. ఉన్నట్టుంది తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. తెల్లవారుజాము ఘటన జరిగినందున ఎవరూ గుర్తించలేకపోయారు. దీంతో 11 మంది మంటల్లో చిక్కుకొని మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులోని నలుగురు సురక్షితంగా […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 15, 2020 / 12:40 PM IST
    Follow us on

    వృద్ధాశ్రమంలో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది బలైన ఘటన రష్యాలో చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున 3 గంటలకు ఈ ఘటన జరగడంతో తీవ్ర విషాదం నెలకొంది. రష్యాలోని బాష్కోర్టోస్టాన్ ప్రాంతంలోని ఉరల్ పర్వత శ్రేణుల్లో ఉన్న ఓ ఆశ్రమంలో వృద్ధులు నివసిస్తున్నారు. ఉన్నట్టుంది తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. తెల్లవారుజాము ఘటన జరిగినందున ఎవరూ గుర్తించలేకపోయారు. దీంతో 11 మంది మంటల్లో చిక్కుకొని మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులోని నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే అగ్నిప్రమాదం మొదలైనప్పుడు వ్రుద్ధులైనందున వారు ఎటూ వెళ్లలేకపోవడంతో 11 మంది మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు.