
అమెరికా నుంచి పెన్సిల్వేనియా రాష్ట్రం నుంచి జో బైడెన్ ఎన్నిక చెల్లదంటూ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి మైక్ కెల్లీ దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికా సుప్రీం కోర్టు విచారించకుండానే కొట్టివేసింది. జో బైడెన్‌కు మెయిల్ ద్వారా ఎక్కువ ఓట్లు వచ్చాయని, మెయిల్ ఓట్లకు రాజ్యాంగపరంగా భద్రత లేనందున పెన్సిల్వేనియా నుంచి ఆయన ఎన్నిక చెల్లదని పిటిషనర్ పేర్కొన్నారు.