
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. మమతా బెనర్జీ అంటేనే అసహనానికి పర్యాయపదంగా మారిపోయిందన్నారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పభుత్వంలో అసహనం ఘోరంగా పెరిగిపోయిందన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఆయన కోల్‌కతాకు చేరుకున్నారు. వివిధ ఏరియాల్లో తొమ్మిది పార్టీ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు.