అవన్నీ ఒట్టి మాటలే: బీహార్ సీఎం
జేడీయూ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాంటూ ఆర్జేడీ నేత శ్యామ్ రజాక్ చేసిన వ్యాఖ్యలను బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ సీనియర్ నేత నితీశ్‌కుమార్ తోసిపుచ్చారు. అవన్నీ ఒట్టి మాటలేనని కొట్టిపారేశారు. జేడీయూ నుంచి 17 మంది కాదు కదా ఒక్కరు కూడా ఆర్జేడీలోకి వెళ్లబోరని తేల్చిచెప్పారు. ఈ మధ్యాహ్నం ఆర్జేడీ నేత శ్యామ్ రజాక్ మీడియాతో మాట్లాడుతూ.. జేడీయూకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు.
Written By:
, Updated On : December 30, 2020 / 05:35 PM IST