https://oktelugu.com/

దారుణం.. గంటల చొప్పున భార్యను అమ్మకానికి పెట్టిన భర్త..!

ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లలో నూటికి తొంబై శాతం మోసపోతున్నారు.. కేవలం పదిశాతం మంది మాత్రమే హాయిగా ఉంటున్నారనే అభిప్రాయం తల్లిదండ్రులతోపాటు ప్రేమికుల్లో ఉంది. ప్రేమ పెళ్లి మోసాలు కామన్ అయిపోతున్న సమయంలోనే ప్రజలంతా విస్తూపోయేలా ఏపీలో ఓ దారుణ సంఘటన వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి చెందిన రేవంత్ అనే యువకుడు ఓ యువతితో ప్రేమాయణం నడిపాడు. వీరిద్దరి పెళ్లికి పెద్దలు ఒప్పకోకపోవడంతో వీరిద్దరు బెంగూళూరు వెళ్లారు. అక్కడే ఆగస్టు 23న పెళ్లి చేసుకున్నారు. కొన్నిరోజులు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 30, 2020 / 05:41 PM IST
    Follow us on

    ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లలో నూటికి తొంబై శాతం మోసపోతున్నారు.. కేవలం పదిశాతం మంది మాత్రమే హాయిగా ఉంటున్నారనే అభిప్రాయం తల్లిదండ్రులతోపాటు ప్రేమికుల్లో ఉంది. ప్రేమ పెళ్లి మోసాలు కామన్ అయిపోతున్న సమయంలోనే ప్రజలంతా విస్తూపోయేలా ఏపీలో ఓ దారుణ సంఘటన వెలుగుచూసింది.

    ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి చెందిన రేవంత్ అనే యువకుడు ఓ యువతితో ప్రేమాయణం నడిపాడు. వీరిద్దరి పెళ్లికి పెద్దలు ఒప్పకోకపోవడంతో వీరిద్దరు బెంగూళూరు వెళ్లారు. అక్కడే ఆగస్టు 23న పెళ్లి చేసుకున్నారు. కొన్నిరోజులు యువతితిని బాగానే చూసుకున్న రేవంత్ ఆ తర్వాత ఆమెను హింసించడం మొదలుపెట్టాడు.

    భార్యను శారీరకంగా..మానసికంగా హింసించడంతోపాటు అదనపు కట్నం కోసం వేధించేవాడు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో కొన్నిరోజులుగా ఆమె తన పుట్టింట్లో ఉంటోంది. ఈక్రమంలోనే ఆమె ఫోటోలో ఆన్ లైన్లో కన్పించడంతో షాక్ గురైంది.

    ఆమె భర్తే ఆన్ లైన్లో గంటల చొప్పున అమ్మకానికి పెట్టాడని తెలుసుకొని కుమిలిపోయింది. దీంతో తన భర్తను నిలదీసేందుకు రేవంత్ ఇంటికి వెళ్లింది. అయితే భార్య రాకతో రేవంత్ కుటుంబం అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న మహిళ సంఘాలు రంగంలోకి దిగి రేవంత్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.

    కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే గంటల చొప్పున విక్రయిస్తానని ఆన్ లైన్లో భార్య ఫొటోలు అప్ లోడ్ చేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఈ సంఘటనపై త్వరలోనే మరింత క్లారిటీ వచ్చే అవకాశం కన్పిస్తోంది.