https://oktelugu.com/

వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్రం ససేమిరా?

రైతు సంఘాల నేతలతో బుధవారం జరిగిన చర్చల్లో మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు నిరాకరించిందని సమాచారం. ఇప్పటికైనా అన్నదాతల ఆందోళనను విరమించాలని కేంద్రం అభ్యర్థించినట్లు సమాచారం. మూడు వారాల పాటు కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ప్రతిష్ఠంభన కొనసాగిన తర్వాత బుధవారం విజ్ఞాన్‌భవన్‌లో ఆరో విడుత చర్చలు జరిగాయి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అనుసరించాల్సిన విధి విధానాలు, పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) హామీ తదితర అంశాలపైనే చర్చల్లో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 30, 2020 / 05:30 PM IST
    Follow us on

    రైతు సంఘాల నేతలతో బుధవారం జరిగిన చర్చల్లో మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు నిరాకరించిందని సమాచారం. ఇప్పటికైనా అన్నదాతల ఆందోళనను విరమించాలని కేంద్రం అభ్యర్థించినట్లు సమాచారం. మూడు వారాల పాటు కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ప్రతిష్ఠంభన కొనసాగిన తర్వాత బుధవారం విజ్ఞాన్‌భవన్‌లో ఆరో విడుత చర్చలు జరిగాయి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అనుసరించాల్సిన విధి విధానాలు, పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) హామీ తదితర అంశాలపైనే చర్చల్లో దృష్టి సారించాలని రైతు సంఘాల నేతలు స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది.ఆందోళన సందర్భంగా మరణించిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, వారికి నష్ట పరిహారం చెల్లించాలని రైతు సంఘాల నేతలు డిమాండ్‌ చేసినట్లు తెలిసింది.