
కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులను బలి తీసుకోవడం కలవరానికి గురి చేస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కరోనా వైరస్‌తో మృతి చెందారు. తాజాగా తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి అన్నాడిఎంకె నేత ఆర్. దొరైకన్ను కరోనా వ్యాధితో మృతి చెందారు. గతనెల అక్టోబర్ 13న పాజిటివ్‌గా నిర్దారణ అయిన ఆయన అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. శనివారం రాత్రి ఆయన పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కావేరి ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ తెలిపారు. కాగా తమిళనాడు వ్యాప్తంగా 8.2 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.