https://oktelugu.com/

వ్యాక్సిన్‌ ట్రయల్‌కు ఏడీసీఏ గ్రీన్‌సిగ్నల్‌..

ఆఫ్రికా దేశాలను అతలాకుతలం చేసిన ‘ఎబోలా’ వైరస్‌ వ్యాక్సిన్‌ ప్రయోగానికి ‘అమెరికన్‌ డ్రగ్‌ కంట్రోల్‌ ఏజెన్సీ’ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. రీజెనరాన్‌ ఫార్మ కంపెనీ అభివృద్ధి చేసీన ఈ వ్యాక్సిన్‌ను ఎబోల వైరస్‌తో బాధపడే చిన్నారులు, పెద్దలపై ప్రయోగించనున్నారు. గత జూన్‌ చివరి వరకు ఆఫ్రికాలోని కాంగో ప్రాంతంలో దాదాపు 2300 మంది ఎబోలా వైరస్‌తో మృతి చెందారు. ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రీజెనరాన్‌ కంపెనీ ‘ఇన్‌మాజెబ్‌’ వ్యాక్సిన్‌ను కనిపెట్టింది. దీనిని నాలుగు విడతల్లో ప్రయోగం […]

Written By: , Updated On : October 15, 2020 / 12:41 PM IST
Follow us on

ఆఫ్రికా దేశాలను అతలాకుతలం చేసిన ‘ఎబోలా’ వైరస్‌ వ్యాక్సిన్‌ ప్రయోగానికి ‘అమెరికన్‌ డ్రగ్‌ కంట్రోల్‌ ఏజెన్సీ’ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. రీజెనరాన్‌ ఫార్మ కంపెనీ అభివృద్ధి చేసీన ఈ వ్యాక్సిన్‌ను ఎబోల వైరస్‌తో బాధపడే చిన్నారులు, పెద్దలపై ప్రయోగించనున్నారు. గత జూన్‌ చివరి వరకు ఆఫ్రికాలోని కాంగో ప్రాంతంలో దాదాపు 2300 మంది ఎబోలా వైరస్‌తో మృతి చెందారు. ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రీజెనరాన్‌ కంపెనీ ‘ఇన్‌మాజెబ్‌’ వ్యాక్సిన్‌ను కనిపెట్టింది. దీనిని నాలుగు విడతల్లో ప్రయోగం చేసిన తరువాత గత డిసెంబర్‌లో ‘అమెరికన్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌’ అనుమతి ఇచ్చింది.దీంతో ఎఫ్‌డీఏ అనుమతి పొందడంతో మిగతా అనుమతులకు మార్గం సుగమం అయిందని లిప్‌సిచ్‌ తెలిపారు. తాజాగా ‘అమెరికా అమెరికన్‌ డ్రగ్‌ కంట్రోల్‌ ఏజెన్సీ’ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో వ్యాక్సిన్‌ను ప్రయోగించనున్నారు.