బిగ్‌బాస్‌ ఓటింగ్‌పై అనుమానాలు.? సంచలన ఆరోపణ!

బిగ్‌బాస్‌.. వరల్డ్‌ వైడ్‌ ఫేమస్‌ షో. ఎన్నోభాషల్లో టెలికాస్ట్‌ అవుతున్న బిగ్‌బాస్ తెలుగులోనూ నాలుగేళ్ల క్రితం ప్రారంభమైంది. ప్రస్తుతం సీజన్‌ 4 నడుస్తోంది. ఎన్నో రికార్డులను క్రియేట్‌ చేస్తూ దూసుకుపోతోంది. చాలా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల ఆదరణను పొందింది. దీంతో టాప్‌ షోగా వెలుగొందుతోంది. గత మూడు సీజన్లు ఎలాంటి విమర్శలు లేకుండా సాఫీగానే సాగిన షో.. ఈ నాలుగో సీజన్‌లో మాత్రం పలు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగా బిగ్‌బాస్‌ 4వ సీజన్‌ నుంచి […]

Written By: NARESH, Updated On : October 15, 2020 3:22 pm
Follow us on

బిగ్‌బాస్‌.. వరల్డ్‌ వైడ్‌ ఫేమస్‌ షో. ఎన్నోభాషల్లో టెలికాస్ట్‌ అవుతున్న బిగ్‌బాస్ తెలుగులోనూ నాలుగేళ్ల క్రితం ప్రారంభమైంది. ప్రస్తుతం సీజన్‌ 4 నడుస్తోంది. ఎన్నో రికార్డులను క్రియేట్‌ చేస్తూ దూసుకుపోతోంది. చాలా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల ఆదరణను పొందింది. దీంతో టాప్‌ షోగా వెలుగొందుతోంది. గత మూడు సీజన్లు ఎలాంటి విమర్శలు లేకుండా సాఫీగానే సాగిన షో.. ఈ నాలుగో సీజన్‌లో మాత్రం పలు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగా బిగ్‌బాస్‌ 4వ సీజన్‌ నుంచి ఇటీవల ఎలిమినేషన్‌ అయిన ఓ కంటెస్టెంట్‌ నమ్మలేని నిజాలు వెల్లడించింది.

Also Read: ఒగ్గేసిపోకే అమృత.. అంటూ విరహాగీతం పాడుతున్న మెగాహీరో..!

గత సీజన్లతో పోలిస్తే ఈ సారి ఏమాత్రం హడావిడి లేకపోయినా.. అంగరంగ వైభవంగానే ప్రారంభమైంది బిగ్ బాస్ షో. గత నెలలో మొదలైన నాలుగో సీజన్‌లో పేరున్న కంటెస్టెంట్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రీమియర్ ఎపిసోడ్ గ్రాండ్ సక్సెస్ అయినప్పటికీ.. ఆ తర్వాత చాలా రోజులపాటు నాలుగో సీజన్‌కు అంతగా ఆదరణ లభించలేదు. పైగా చాలా చప్పగా సాగింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు సరికొత్త టాస్కులు పరిచయం చేయడంతోపాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, మసాలా సీన్లు యాడ్ చేశారు. దీంతో షో ఒక్కసారిగా ఊపందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

ఈ సీజన్‌ ప్రారంభమై ఐదు వారాలు గడిచిపోయింది. వారానికి ఒకరిని చొప్పున బిగ్‌బాస్‌ ఎలిమినేట్‌ చేస్తూనే ఉన్నారు. ముందుగా సూర్యకిరణ్‌, తర్వాత కరాటే కల్యాణి, దేవీ నాగవల్లి, స్వాతి దీక్షిత్‌, జోర్దార్‌‌ సుజాత ఇంటి నుంచి వెళ్లిపోయారు. గంగవ్వ అనారోగ్య కారణాలతో షో నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు పదమూడు మంది ఇంట్లో కొనసాగుతున్నారు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వెళ్లిపోయిన కంటెస్టెంట్లు ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. గతంలో మాదిరిగానే ఈ సీజన్‌లో నుంచి ఎలిమినేట్ అయిన వారందరూ తరచూ టీవీల్లో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హౌస్‌లోని కంటెస్టెంట్లపై కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు, బిగ్ బాస్ షో నిర్వహకులపైనా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో షో హైలైట్ అవుతూనే ఉంది.

హౌస్‌లో ఎవరు కొనసాగాలి.. ఎవరు ఎలిమినేట్‌ కావాలని అనేది ప్రేక్షకుల చేతిలో ఉందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే వారు వేసే ఓట్ల ఆధారంగానే విన్నర్‌‌ను డిసైడ్‌ చేస్తారు కాబట్టి. ప్రతి సోమవారం జరిగే ప్రక్రియలో నామినేట్ అయిన కంటెస్టెంట్లలో తక్కువ ఓట్లు వచ్చిన వారు ఎలిమినేట్ అవుతుంటారు. అయితే.. ఇప్పటివరకు జరిగిన నామినేషన్లలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఓటింగ్ సిస్టమ్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిన ఎన్టీఆర్..!

తాజాగా కరాటే కల్యాణీ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఇలాంటి ఆరోపణలే చేసింది. ‘బిగ్ బాస్ ఓటింగ్‌పై అనుమానాలు ఉన్నాయి. లీస్ట్ ఉన్న కంటెస్టెంట్లు కాకుండా మిగిలిన వాళ్లు ఎలిమినేట్ అవుతున్నారు. నేను, దేవీ నాగవల్లి, సుజాత అలాగే బయటకు వచ్చాం. అన్ని ఓట్లు పోలయ్యాయని చెప్పి.. మాకెన్ని వచ్చాయో చెప్పకపోవడం దారుణం’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఒకవిధంగా అటు ప్రేక్షకుల్లోనూ ఇలాంటి అనుమానాలే తలెత్తుతున్నాయి. ఫలానా కంటెస్టెంట్‌ ఈ వారం ఎలిమినేట్‌ అవుతాడని అనుకుంటున్న తరుణంలో.. ఆ కంటెస్టెంట్‌ కాకుండా ఎవరో ఎక్స్‌పెక్ట్‌ చేయని వారు హౌస్‌ నుంచి బయటకు వచ్చేస్తున్నారు.