
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం జరిగిన ఈ అగ్ని ప్రమాదం శుక్రవారం ఉదయం వరకు మంటలు అదుపులోకి రాలేదు. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటిసెంటర్‌లో ఉన్న ఓ షాపింగ్ మాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. షాపింగ్‌మాల్‌లో 300 మంది ఉండగా అగ్నిమాపక సిబ్బంది శ్రమించి వారిని సురక్షింతగా బయటకు తెచ్చారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. అలాగే 24 ఫైర్ ఇంజన్లతో పాటు 16 జంబో ట్యాంకులతో మంటలను ఆర్పుతున్నారని అగ్నిమాపక దళం అధికారి శశికాంత్ కాలే పేర్కొన్నారు.