సీఎం జగన్ కు మరో షాక్ ఇచ్చిన నిమ్మగడ్డ

ఏపీలో టామ్ అండ్ జెర్రీ ఫైట్ సాగుతోంది. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అంత ఈజీగా సీఎం జగన్ ను వదిలేలా కనిపించడం లేదు. చంద్రబాబు హయాంలో నియామకమైన నిమ్మగడ్డను జగన్ తొలగించడం.. ఆయన కోర్టుల్లో పోరాడి మరీ తిరిగి నియామకం అయ్యారు. ఈ ఫైట్ల ో జగన్ ఓడిపోగా.. నిమ్మగడ్డ గెలిచాడు. కానీ తనను ముప్పుతిప్పలు పెట్టిన జగన్ ను వదిలేలా కనిపించడం లేదు నిమ్మగడ్డ. తాజాగా సీఎం జగన్ కు మరో గట్టి షాక్ ఇచ్చారు నిమ్మగడ్డ. […]

Written By: NARESH, Updated On : November 17, 2020 12:19 pm
Follow us on

ఏపీలో టామ్ అండ్ జెర్రీ ఫైట్ సాగుతోంది. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అంత ఈజీగా సీఎం జగన్ ను వదిలేలా కనిపించడం లేదు. చంద్రబాబు హయాంలో నియామకమైన నిమ్మగడ్డను జగన్ తొలగించడం.. ఆయన కోర్టుల్లో పోరాడి మరీ తిరిగి నియామకం అయ్యారు. ఈ ఫైట్ల ో జగన్ ఓడిపోగా.. నిమ్మగడ్డ గెలిచాడు. కానీ తనను ముప్పుతిప్పలు పెట్టిన జగన్ ను వదిలేలా కనిపించడం లేదు నిమ్మగడ్డ. తాజాగా సీఎం జగన్ కు మరో గట్టి షాక్ ఇచ్చారు నిమ్మగడ్డ.

Also Read: జనసేనలోకి మళ్లీ జేడీ.. పక్కా హామీ ఇస్తేనేనట..!

సీఎం జగన్ సోమవారం కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన రోజే నిమ్మగడ్డ ఈ లేఖ రాయడం కలకలం రేపింది. ఈ సన్నాహాలపై నిమ్మగడ్డ లేఖలో అభ్యతరం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు జరుగుతున్న సన్నాహాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) అభ్యంతరం తెలిపింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందని.. అది పూర్తయ్యేదాకా జిల్లాల పునర్విభజన చేయడం తగదని ఎస్ఈసీ రమేశ్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. ‘13 జిల్లాల ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను చేపట్టాం. ఎన్నికలు పూర్తయ్యేదాకా 13 జిల్లాలే ఉండాలి. లేనిపక్షంలో జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి సాంకేతిక సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేదాకా జిల్లాలపై విధాన నిర్ణయం తీసుకోవద్దు’’ అని ఆయన తన లేఖలో సీఎస్ ను కోరినట్లు తెలిసింది. దీంతో జిల్లాల విభజనకు వ్యతిరేకంగా నిమ్మగడ్డ మరో అస్త్రం సంధించినట్టైంది. దీనిపై జగన్ సర్కార్ ఏ విధంగా ముందుకెళుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read: కమలం ‘గ్రేటర్’ ఆపరేషన్..కారు పరేషాన్

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మరోసారి ఏపీ సర్కార్ తో నేరుగా ఢీకొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధాన నిర్ణయాలను అడ్డుకోవాలని తాజాగా లేఖ సంధించారు.. ఏపీ సీఎం జగన్ వచ్చే కొత్తసంవత్సరం జనవరిలో కొత్త జిల్లాలు ఏర్పాటు దిశగా వడివడిగా ముందుకు పోతుంటే   ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అడ్డుపుల్లలు వేయడం సంచలనంగా మారింది. దీన్ని జగన్ ఎలా ఎదుర్కొంటాడో వేచిచూడాలి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్