Imd- Monsoon: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. రుతుపవనాల రాక ప్రక్రియ ప్రారంభం అయినందున దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏప్రిల్ లో ప్రకటించిన విషయానికి ఇప్పుడు చెప్పేదానికి పొంతన కుదరడం లేదు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చెబుతున్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులకు తెలుసో లేక తెలియదో అనే సంశయాలు వస్తున్నాయి అందుకే అధికారులు ఏదైనా ప్రకటన చేసే ముందు ఆలోచించుకుంటే మంచిదనే వాదనలు వస్తున్నాయి.
ఏప్రిల్ లో వాతావరణ శాఖ దేశంలో సాధారణ వర్షపాతమే ఉంటుందని తెలియజేసింది. 99 శాతం వర్షపాతం ఉంటుందని సూచించింది. కానీ ప్రస్తుతం అధిక వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. 103 శాతం వర్షపాతం కురుస్తుందని అంచనా వేస్తోంది. మధ్య భారతదేశంలో వర్షపాతం అధికంగా ఉంటుందని చెప్పింది. ఈశాన్య భారతంలో తక్కువ వర్షపాతమే ఉంటుందని అభిప్రాయపడింది. దీంతో వాతావరణ శాఖ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ప్రజల్లో అనుమానాలు వస్తున్నాయి.
Also Read: KCR vs BJP: జూన్ 2 ముహూర్తం.. బీజేపీపై కేసీఆర్ బయటపడుతాడా?
ఇప్పటికే ఢిల్లీలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ సారి కూడా వర్షాలు ముందే వచ్చినట్లు తెలుస్తోంది. వ్యవసాయాధారిత దేశం కావడంతో వర్షాలతోనే దేశంలో పంటలు పండే విధానం ఉండటంతో వర్షాలే మనకు ఆదారం. అందుకే వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తుంటారు. పంటల దిగుబడిలో వర్షాలే ప్రధాన భూమిక పోషిస్తాయి. వర్షపాతమే మనకు పంటలు పండేందుకు ప్రధాన వనరుగా ఉంటోంది. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుందనేది తెలిసిందే.
ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రెండు రకాలుగా ప్రకటనలు చేయడంతో ఏది నిజమో ఏది అబద్దమో తెలియడం లేదు. ప్రజలకు సరైన విధంగా వార్తలు తెలియజేయడం అధికారుల బాద్యత అయినా వారి సమాధానాలు ఇలా ప్రశ్నార్థకంగా ఉండటం అనుమానాస్పదమే. ఇంతకీ అధికారుల ప్రకటనలో ఎందుకు తేడాలు వస్తున్నాయి. ఎందుకు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు అనే దానిపై అధికారులకే తెలియాలి. దీంతో వాతావరణ శాఖ అధికారుల్లో సమన్వయం కొరవడిందా? వార్తల విషయంలో ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారా? అనేది అనుమానాస్పదమే.
Also Read:Divya Vani Resigns Row: దివ్యవాణి రాజీనామా ఎపిసోడ్ వెనుక జరిగింది ఇదా?