https://oktelugu.com/

Heroine Poorna: పెళ్లికి సిద్ధమైన హీరోయిన్ పూర్ణ… వరుడు ఎవరంటే!

Heroine Poorna: హీరోయిన్ పూర్ణ పెళ్ళికి సిద్ధమయ్యారు. ఆమె తనకు కాబోయేవాడిని పరిచయం చేసింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో స్వీట్ న్యూస్ పంచుకున్నారు. షానిద్ అసిఫ్ అలీ అనే వ్యక్తితో ఆమెకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తుంది. ఇంస్టాగ్రామ్ లో అసిఫ్ అలీ తన బెటర్ హాఫ్ అంటూ కామెంట్ చేసిన పూర్ణ రింగ్ ఎమోజీ పోస్ట్ చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఈ వివాహం జరుగుతుందని వెల్లడించారు. ఈ క్రమంలో పూర్ణ-అసిఫ్ అలీ లది పెద్దలు […]

Written By:
  • Shiva
  • , Updated On : June 1, 2022 / 08:49 AM IST
    Follow us on

    Heroine Poorna: హీరోయిన్ పూర్ణ పెళ్ళికి సిద్ధమయ్యారు. ఆమె తనకు కాబోయేవాడిని పరిచయం చేసింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో స్వీట్ న్యూస్ పంచుకున్నారు. షానిద్ అసిఫ్ అలీ అనే వ్యక్తితో ఆమెకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తుంది. ఇంస్టాగ్రామ్ లో అసిఫ్ అలీ తన బెటర్ హాఫ్ అంటూ కామెంట్ చేసిన పూర్ణ రింగ్ ఎమోజీ పోస్ట్ చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఈ వివాహం జరుగుతుందని వెల్లడించారు. ఈ క్రమంలో పూర్ణ-అసిఫ్ అలీ లది పెద్దలు కుదిర్చిన పెళ్లి కావచ్చనే సందేహం కలుగుతుంది.

    Heroine Poorna

    గతంలో పూర్ణ తనకు లవర్ ఉన్నట్లు వెల్లడించిన దాఖలాలు లేవు. పూర్ణను పెళ్లాడే అసిఫ్ అలీ ఓ బిజినెస్ మాన్. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ అండ్ సీఈఓ. కోట్లకు అధిపతి అయిన అసిఫ్ తో పూర్ణ వివాహం జరగనుంది. పూర్ణ అనే పేరుతో ఫేమస్ అయిన ఆమె అసలు పేరు షమ్నా ఖాసీం. కేరళకు చెందిన ముస్లిం అమ్మాయి. పేరు కారణంగా చాలా మంది ఆమెను హిందువుగా భావిస్తూ ఉంటారు.

    Also Read: Balakrishna- BVS Ravi: బాలయ్యకు ఇంత పెద్ద రిస్క్ అవసరమా?

    తెలుగులో పూర్ణ నటించిన సీమ టపాకాయ్, అవును చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. కెరీర్ లో హిట్స్ ఉన్నప్పటికీ ఆమె ఎదగలేకపోయారు. సెకండ్ ఇన్నింగ్స్ లో పూర్ణ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అఖండ, దృశ్యం 2 చిత్రాల్లో పూర్ణ కీలక పాత్రలు చేశారు.

    Heroine Poorna

    మరోవైపు బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ఢీ సీజన్ 13కి ఆమె జడ్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ప్రియమణి తో పాటు ఆమె ఆ షో జడ్జిగా చేశారు. అయితే ఢీ 14 నుండి ఆమెను తప్పించారు. తాజాగా ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి షిఫ్ట్ అయినట్లు తెలుస్తుంది. కాగా హీరోయిన్ గా కెరీర్ ముగిసిన నేపథ్యంలో పూర్ణ పెళ్లి చేసుకొని సెటిల్ కావాలని నిర్ణయించుకున్నారు. పూర్ణ వివాహం ఎప్పుడనే విషయం తెలియాల్సి ఉంది. కాబోయేవాడిని పరిచయం చేసిన పూర్ణకు అభిమానులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.

    Also Read:KK Death Mystery: సింగర్ కెకె మృతిపై అనుమానాలు… విచారణ చేపట్టిన పోలీసులు!

    Tags