HomeజాతీయంKedarnath Temple: మంచు ముప్పు వేళ.. తెరుచుకున్న కేదార్ నాథ్.. భక్తులకు అధికారుల కీలక సూచన

Kedarnath Temple: మంచు ముప్పు వేళ.. తెరుచుకున్న కేదార్ నాథ్.. భక్తులకు అధికారుల కీలక సూచన

Kedarnath Temple: శివ భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన కేదార్ నాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్నాయి. సోమవారం రాత్రి దాకా ఆ ప్రాంతంలో భారీగా హిమపాతం నమోదయింది. అసలే హిమాలయ పర్వత ప్రాంతం కాబట్టి, గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని కేదార్ నాథ్ ధామ్ అధికారులు ఒకానొక సందర్భంలో యాత్ర సాగేది కష్టమే అనే సంకేతాలు ఇచ్చారు. కానీ మంగళవారం హఠాత్తుగా మంచు కురవడం నిలిచిపోయింది. దీనికి తోడు వాతావరణ పరిస్థితి కూడా మెరుగుపడటంతో కేదార్ నాథ్ ధామ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది.” వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో కేదార్ నాథ్ ధామ్ సందర్శనకు యాత్రికులకు అనుమతి ఇచ్చామని” ఉత్తరాఖండ్ డిజిపి అశోక్ కుమార్ వెల్లడించారు.

గత కొద్దిరోజులుగా వాతావరణంలో నెలకొన్న పరిస్థితులు నేపథ్యంలో భారత వాతావరణ శాఖ సూచనల మేరకు చార్ ధామ్ యాత్రికులను వివిధ ప్రదేశాలలో నిలిపివేశారు. మంచు భారీగా కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రమాద సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు. కేదార్ నాథ్ ధామ్ వైపు వెళ్లే బద్రీనాథ్ యాత్రికులను శ్రీనగర్ గర్వాల్ లో నిలిపివేశారు. ముందస్తుగా యాత్ర, హోటల్ టికెట్లు బుక్ చేసుకున్న సందర్శకులకు మాత్రమే రుద్రప్రయాగ్ కు వెళ్ళేందుకు అనుమతి ఇస్తున్నారు. యాత్రికుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని శ్రీనగర్ ప్రాంతాల్లోనే నిలిపివేస్తున్నారు. వారికి ప్రత్యేక గృహాల్లో వసతి కల్పిస్తున్నారు. ఎందుకంటే గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఈ యాత్రకు వెళ్లే క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఈ నేపథ్యంలో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉత్తరాఖండ్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.

చార్ ధామ్ యాత్ర నేపథ్యంలో డెహ్రాడూన్ ప్రాంతాన్ని పోలీసులు ఐదు సెక్టార్లుగా విభజించారు. ఇందులో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి పోలీస్ అధికారులను నియమించారు. అంతేకాకుండా సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని జోనల్ అధికారిగా నియమించారు. ఇక ఇది ఇలా ఉండగా రాబోయే ఏడు రోజులపాటు కేదార్నాథ్, బద్రి నాథ్ ప్రాంతాల్లో భారీగా హిమపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలుచోట్ల భద్రతను పటిష్టం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.. ఇక మంగళవారం కేదార్ నాథ్ ఆలయం తెచ్చుకున్న నేపథ్యంలో అక్కడ కొలువైన శివుడిని 20 క్వింటాళ్ళ పూలతో అలంకరించారు. తొలి బ్యాచ్ యాత్రికులు హరిద్వార్ నుంచి చార్ ధామ్ యాత్రకు గత శనివారం బయలుదేరారు. గతంలో ఈ యాత్రకు అంత ప్రాచుర్యం ఉండేది కాదు. అయితే చార్ ధామ్ ఆలయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బిజెపి ప్రభుత్వం అభివృద్ధి చేయడంతో యాత్రికులు భారీగా వస్తున్నారు. యాత్రికుల రాకను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ఐఆర్సీటీసీ ప్రత్యేకంగా హెలికాప్టర్ సేవలు ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వాతావరణం ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో ఆ సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. వాతావరణం ఏమాత్రం అనుకూలించినా హెలికాప్టర్ సేవలు ప్రారంభిస్తామని టూరిజం శాఖ అధికారులు చెబుతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular