దేశంలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విజృంభిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైరస్ విజృంభించిన తొలినాళ్లలో పట్టణాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం మారుమూల పల్లెల్లో సైతం కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కరోనా కేసులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Also Read : మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా సోకిందా?
అయితే వ్యాక్సిన్ కోసం మరికొన్ని నెలలు ఎదురుచూపులు తప్పదు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తాజాగా 2021 సంవత్సరం జనవరి నాటికి కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. నేడు రాజ్యసభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ లో కూడా ఇతర దేశాల మాదిరిగానే వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. దేశంలో మూడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని చెప్పారు.
భారత్ కరోనా వ్యాక్సిన్ కొరకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని మంత్రి తెలిపారు. దేశంలోని మూడు వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ ను ఒక నిపుణుల బృందం పర్యవేక్షిస్తోందని మంత్రి వెల్లడించారు. పూణెలోని సీరం సంస్థ త్వరలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించనుందని… భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా కంపెనీలు వేగంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నాయని తెలిపారు.
సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జనవరి వరకు కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూడాలని చెప్పడంతో ప్రజలు మరో మూడు నెలలు ఇబ్బందులు తప్పవా…? అనే భావనలో ఉన్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల గడిచిన ఆరున్నర నెలలుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
Also Read : బిగ్ బ్రేకింగ్: కరోనాతో తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ మృతి