వెక్కిరిస్తున్న ఏపీ ఖజానా.. జగన్ ఏం చేయనున్నాడు?

అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరిట ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేస్తుంటాయి.. ఆ తర్వాత పన్నుల పేరుతో ప్రజల భారంమోపుతూ ముక్కుపిండి వసూలు చేస్తుండటం చూస్తూనే ఉన్నాం.. ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలకు ఎరవేసిన హామీలను నెరవేర్చేందుకు గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఖజానాను ఖాళీ చేస్తున్నారు. కేవలం సంక్షేమ పథకాలకే వేల కోట్లు ఖర్చు చేస్తూ అభివృద్ధి గాలికొదిలేస్తుంటంపై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. Also Read: బీజేపీలో చేరికలపై వీర్రాజు ‘లెక్కే’ వేరప్పా..! ఏపీ-తెలంగాణ రెండు […]

Written By: NARESH, Updated On : September 17, 2020 7:22 pm

Ap treasury

Follow us on


అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరిట ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేస్తుంటాయి.. ఆ తర్వాత పన్నుల పేరుతో ప్రజల భారంమోపుతూ ముక్కుపిండి వసూలు చేస్తుండటం చూస్తూనే ఉన్నాం.. ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలకు ఎరవేసిన హామీలను నెరవేర్చేందుకు గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఖజానాను ఖాళీ చేస్తున్నారు. కేవలం సంక్షేమ పథకాలకే వేల కోట్లు ఖర్చు చేస్తూ అభివృద్ధి గాలికొదిలేస్తుంటంపై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.

Also Read: బీజేపీలో చేరికలపై వీర్రాజు ‘లెక్కే’ వేరప్పా..!

ఏపీ-తెలంగాణ రెండు రాష్ట్రాలుగా 2014లో విడిపోయాయి. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా అవతరించగా.. ఏపీ 90వేల కోట్ల అప్పుతో కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. నాడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఏపీ అభివృద్ధి పేరిట వేల కోట్లు అప్పులు చేశారు. చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు.. రాజధాని నిర్మాణం.. అభివృద్ధి పేరిట వేలకోట్లు అప్పులు చేశారు. టీడీపీ అధికారంలోకి దిగిపోయేనాటికి ఏపీ ఖజానా పూర్తిగా డొల్లచేసి పోయారు. ఆ తర్వాత సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కోసం వేల కోట్లు ఖర్చు చేసున్నారు.

ఏపీలో అప్పుల ఊబిలో కురుకుపోయినా జగన్ మాత్రం సంక్షేమ పథకాల అమలులో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. దీనికి తోడు కొత్తకొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ మరిన్ని అప్పులు తీసుకొస్తున్నారు. జగన్ 15నెలలు పరిపాలనలో ఏకంగా 97వేల కోట్ల రూపాయాల అప్పులు తెచ్చినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది ఎలా ఉన్నా ప్రస్తుతం ఏపీ సర్కారుకు బ్యాంకులు నుంచి రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఆర్బీఐ రుణపరిమితి కూడా ఏపీకి మించిపోయినట్లు సమాచారం. దీంతో ఏపీకి ప్రస్తుతం అప్పు పుట్టే పరిస్థితి కూడా లేనట్లు తెలుస్తోంది.

మరోవైపు ఏపీకి రాజధాని కూడా లేకపోవడంతో ఆదాయం వచ్చే పరిస్థితులు కన్పించడం లేదు. ఏపీకి అధికంగా ఆదాయాన్ని ఇచ్చే మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపిస్తున్నారు. మద్యం దుకాణాలను తగ్గిస్తూ రేట్లను పెంచుతూ పోతుంది. సంపూర్ణ నిషేధానికి జగన్ కట్టుబడి ఉండటంతో ఏపీకి ఆదాయం పెంచుకునే మార్గాలు మూసుకుపోయాయి. దీనికితోడు కరోనా ఎఫెక్ట్ తోడవడంతో రాష్ట్రంలో పరిశ్రమలన్నీ దెబ్బతిన్నాయి. దీంతో ఏపీకి ప్రతీనెలా వచ్చే ఆదాయం కూడా భారీగా పడిపోయింది. దీనికి తోడు కరోనా నివారణ కోసం ప్రభుత్వమే అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

Also Read: అంతర్వేది ఎఫెక్ట్.. ఓ మంత్రికి పదవి కట్?

ప్రభుత్వం ఓవైపు అప్పులు చేస్తూనే మరోవైపు సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయిస్తుండటంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కోలుకోలేకుండా పోతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు లేకపోవడంతో కేంద్రం ఏపీకి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. గతంలో పెండింగ్ ఉన్న నిధులను కేంద్రం విడుదల చేయాలని పలుమార్లు ఆయన ప్రధాని మోదీకి లేఖలు కూడా రాశారు.

కేంద్రం నుంచి అరకొరగా నిధులు వస్తుండటంతో ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జగన్ సర్కార్ ఆదాయ మార్గాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఏపీ ఖజానా ఖాళీకావడంతో సీఎం జగన్ సంక్షేమ పథకాల్లో కోత పెడుతారా? లేదా మరేదైనా ఆదాయ మార్గాలు అన్వేషిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.