https://oktelugu.com/

పన్ను చెల్లింపుదారులకు ఎస్బీఐ గుడ్ న్యూస్.. ఫ్రీగా ఆ సర్వీసులు..!

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పన్ను చెల్లింపుదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇన్ కం ట్యాక్స్ రిటర్నులు సమర్పించడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు నేపథ్యంలో సులభంగా ఐటీఆర్ దాఖలు చేసే అవకాశం కల్పిస్తోంది. పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరేలా ఎస్బీఐ యోనో యాప్ లో కీలక మార్పులు చేసింది. ఫలితంగా కస్టమర్లు సులభంగా ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేయవచ్చు. Also Read: పేటీఎం కస్టమర్లకు బంపర్ ఆఫర్.. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 29, 2020 / 10:00 AM IST
    Follow us on


    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పన్ను చెల్లింపుదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇన్ కం ట్యాక్స్ రిటర్నులు సమర్పించడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు నేపథ్యంలో సులభంగా ఐటీఆర్ దాఖలు చేసే అవకాశం కల్పిస్తోంది. పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరేలా ఎస్బీఐ యోనో యాప్ లో కీలక మార్పులు చేసింది. ఫలితంగా కస్టమర్లు సులభంగా ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేయవచ్చు.

    Also Read: పేటీఎం కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఇంటి అద్దె చెల్లిస్తే రూ.1000 డిస్కౌంట్..?

    ఎస్బీఐ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాలను వెల్లడించింది. దేశంలో కరోనా మహామ్మారి విజృంభణ వల్ల పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలులో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఐటీఆర్ ఫైలింగ్ పోర్టల్ లో ఒకటైన ట్యాక్స్ టు విన్ తో జత కట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సర్వీసులను అందిస్తుండటం గమనార్హం. ఈ సేవలను పొందడానికి ఎస్బీఐ ఖాతాదారులు ఎలాంటి ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు.

    Also Read: అధికారుల మెడకే ఆ ‘చెత్త’ వ్యవహారం

    ఎస్బీఐ తమ ఖాతాదారులకు అవసరమైతే యోనో యాప్ సహాయంతో సీఏ సర్వీసులను కూడా పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. 199 రూపాయలు చెల్లించి సీఏ సర్వీసులను ఖాతాదారులు పొందాల్సి ఉంటుంది. ఎస్బీఐ కొత్తకొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తూ ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. సాధారణంగా పన్ను చెల్లింపుదారులు జులై నెలలోపు ఐటీఆఅర్ రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుంది.

    మరిన్ని వార్తల కోసం ప్రత్యేకం

    ఎస్బీఐ కస్టమర్లు యోనో యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని షాప్ అండ్ ఆర్డర్ అనే ఆప్షన్ ద్వారా ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ పై క్లిక్ చేసి ఐటీఆర్ ఫైలింగ్ చేయవచ్చు. support@tax2win.in ఈ మెయిల్ లేదా +91 9660996655 నంబర్ కు కాల్ చేసి ఐటీఆర్ ఫైలింగ్ లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఎస్బీఐ కస్టమర్లు సమాచారం పొందవచ్చు.