Hyundai Motor IPO Listing: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిస్టింగ్ కోసం ఇన్వెస్టర్ల నిరీక్షణ ముగిసింది. దేశంలోని రెండవ అతిపెద్ద కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఐపీవో బీఎస్ ఈ, ఎన్ఎస్ ఈ లో లిస్ట్ అయ్యాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా బిఎస్‌ఇలో ఒక్కో షేరుకు రూ. 1931, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎన్‌ఎస్‌ఇలో రూ. 1934 వద్ద లిస్ట్ అయ్యాయి. హ్యుందాయ్ మోటార్ ఐపీవోలో షేర్ల ధర ఒక్కో షేరుకు రూ.1960. ఫ్లాట్ లిస్టింగ్ తర్వాత, హ్యుందాయ్ స్టాక్ బీఎస్సీలో రూ.1,931 వద్ద ప్రారంభమైంది, ఇది ఎగువ ధర బ్యాండ్ కంటే 1.48శాతం తక్కువగా ఉంది. సెషన్‌లో స్టాక్ మరింత క్షీణించి రూ.1,820.40 వద్ద ముగిసింది, ఇష్యూ ధర నుండి దాదాపు 6శాతం వరకు తగ్గింది. దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులలో ఒకటైన హ్యుందాయ్ మోటార్ ఇండియా అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 17 వరకు జరిగిన దాని ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)తో ఇన్వెస్టర్లలో ఆసక్తిని కనబరిచింది. కారణం చాలా ఏళ్ల తర్వాత ఓ కార్ల తయారీ కంపెనీకి చెందిన ఐపీవో కాబట్టి. ఇది భారతదేశ స్టాక్‌లో అతిపెద్దది. మార్కెట్ చ విలువ రూ.27,870 కోట్లు. అక్టోబర్ 22, 2024న హ్యుందాయ్ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) రెండింటిలోనూ లిస్ట్ అయింది. అయితే ఈ లాంచ్ మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది.
హ్యుందాయ్ ఐపీవో పరిస్థితి ఇలా కావడానికి కారణాలు :
* మార్కెట్ పరిస్థితులు: విస్తృత మార్కెట్ పోకడలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్, యూఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి ఇటీవల రికార్డు స్థాయికి చేరుకుంది. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు.
* గ్రే మార్కెట్ ప్రీమియం (GMP): లిస్టింగ్‌కు దగ్గరయ్యే కొద్ది జీఎంపీ గణనీయంగా హెచ్చుతగ్గులకు లోనైంది. ప్రారంభంలో రికవరీ సంకేతాలను చూపుతోంది. ఇది అరంగేట్రం ముందు మళ్లీ తగ్గిపోయింది, ఇది పెట్టుబడిదారులలో మిశ్రమ భావాలను సూచిస్తుంది.
* పెట్టుబడిదారుల ఆసక్తి : రిటైల్ భాగస్వామ్యం ముఖ్యంగా తక్కువగా ఉంది; రిటైల్ ఇన్వెస్టర్లు కేవలం 0.5 రెట్లు మాత్రమే సబ్‌స్క్రయిబ్ చేశారు. అయితే నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 0.6 రెట్లు సబ్‌స్క్రయిబ్ చేసారు, ఈ సెగ్మెంట్ల నుండి ఉత్సాహం లేకపోవడాన్ని సూచిస్తున్నాయి.
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిస్టింగ్‌లో లాభం లేదు
స్టాక్ మార్కెట్‌లో చూసినట్లుగా.. చాలా భారీ ఐపీవోల లిస్టింగ్ గా పేరొందినా ఆ రకమైన లిస్టింగ్ లాభం సాధించలేకపోయింది, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిస్టింగ్‌తో గందరగోళం జరిగింది. దీని షేర్లు తగ్గింపుతో లిస్ట్ అయ్యాయి. ఈ లిస్టింగ్‌ను ఫ్లాట్ లిస్టింగ్ అని పిలుస్తారు ఎందుకంటే పెట్టుబడిదారులు దాని లిస్టింగ్ నుండి మంచి లాభాలను ఆశించారు.
1.3శాతం తగ్గింపుతో లిస్టింగు
హ్యుందాయ్ మోటార్ ఇండియా NSEలో రూ. 1934 వద్ద లిస్ట్ చేయబడింది, ప్రతి షేరుకు IPO ధర రూ. 1934, ఇది 1.3 శాతం తగ్గింపుతో ఉంది. BSEలో దీని లిస్టింగ్ రూ. 1931 వద్ద ఉంది, ఇది 1.5 శాతం తగ్గింపు. లిస్టింగ్ తర్వాత, హ్యుందాయ్ మోటార్ ఇండియా షేర్లు రూ.1844.65కి దిగజారి, ఎగువ స్థాయి రూ.1970కి చేరాయి.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: The countrys second largest car company hyundai motor india limited ipo has been listed on bse and nse
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com