Marriage Age: దేశంలో ఇప్పుడు మహిళల వివాహ వయసు పెంపు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. చడీ చప్పుడు లేకుండా కేంద్రం అమ్మాయిల అర్హత వయసు పెంచేయడంతో అంతా షాక్ అవుతున్నారు. తక్కువ వయసులో పెండ్లి కావడంతో త్వరగా గర్భం దాల్చి అమ్మాయిలు అనారోగ్య బారిన పడుతున్నారని, కాబట్టి వారికి చిన్న వయసులో పెండ్లి కాకుండా ఉంచేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. 18 ఏండ్లు ఉన్న వయసును అబ్బాయిలకు సరిసమానంగా 21 ఏళ్లకు పెంచారు.

ఇందుకు కేంద్రం చెబుతున్న కారణాలు కూడా చాలా బలంగానే ఉంటున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో 18 కంటే కూడా ఇంకా తక్కువ ఏజ్‌లోనే మ్యారేజ్ చేస్తున్నారని, కాబట్టి ఇలాంటి వివాహాలు బాల్య వివాహాల కిందుకు వస్తున్నాయని పేర్కొంది. కాబట్టి ఇలాంటి వాటిని అరికట్టేందుకు తాము అమ్మాయిల వివాహ వయస్సు పెంచుతున్నట్టు తెలిపింది. అయితే ఇండియాలో చాలా వర్గాల మనుషులు నివసిస్తున్నారు.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వివాహాలు జరుగుతుంటాయి. ఇక ఇక్కడ మరో చిక్కు కూడా వచ్చి పడుతోంది. ఇతంకు ముదు పద్దెనిమిదో లా కమిషన్ చేసిన సర్క్యులర్ ఇప్పుడు తెరమీదకు వస్తోంది. ఈ లా కమిషన్ సిఫారసుల్లో మగవారి వివాహ వయుసునే తగ్గించాలంటూ చెప్పింది. వారి వయసును 18 ఏళ్లకు అంటే అమ్మాయిలకు తగ్గించాలని అప్పట్టో సిఫార్సు చేసింది. దీని వల్ల పురుషులను చెడు మార్గాల వైపు మళ్లించే పరిస్థితులు తగ్గుతాయని తెలిపింది.
Also Read: విచారణకు వచ్చిన అత్యాచార కేసు.. కొట్టివేయాలని కోర్టును కోరిన బాధితురాలు.. అసలేమైందంటే?
ఇక ఇదే కాకుండా మహిళలు చిన్నప్పటి నుంచే పోషకాహార పరిస్థితులు వారికి అందుబాటులో ఉండనప్పుడు పెద్దయ్యాక 18 ఏండ్లకు జరిగినా లేదంటే 21ఏళ్ళకి వివాహం జరిగినా పెద్ద తేడా ఏముంటుందని చెబుతున్నారు విశ్లేషకులు. సాధారణంగా మన ఇండియాలో పోషకాహార లోపం చాలా ఎక్కువగానే ఉంటోంది. కాబట్టి దీన్ని అరికట్టకుండా వివాహ వయస్సు పెంచినంత మాత్రాన పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదన్నది నిపుణుల వాదన. కానీ ప్రభుత్వాలు అంటే తమకు అనుకూలంగా ఉన్న వాటిని ముందు చేస్తాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.
Also Read: Omicron in India: దేశాన్ని ఒమిక్రాన్ వైరస్ కమ్మేస్తోందా? 3వ వేవ్ తప్పదా?