పంజాబ్ నేషనల్ బ్యాంక్ మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మహిళలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కొత్త స్కీమ్స్ ను అమలులోకి తెచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ స్కీమ్స్ ద్వారా స్వతహాగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వనుంది. వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండి పెట్టుబడి అవసరమైన మహిళలు ఈ స్కీమ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: రైతంటే భూమి ఉన్నోడా.. పంట పండించేటోడా?
పంజాబ్ నేషనల్ బ్యాంక్ అమలు చేస్తున్న స్కీమ్ లలో పీఎన్‌బీ మహిళా శశక్తికరన్ అభియాన్ స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్ ద్వారా స్వయం సహాయక గ్రూపులు రుణాలను పొందవచ్చు. అగ్రికల్చర్ వర్క్ కాకుండా ఇతరత్రా పనుల కోసం ఈ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మహిళల కోసం అమలు చేస్తున్న స్కీమ్ లలో పీఎన్‌బీ మహిళా సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. వ్యాపారం చేయాలనుకునే మహిళలు ఈ స్పెషల్ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఓవర్ టైమ్ చేస్తే డబుల్ జీతం..?
ఇంటి నుంచే స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. డే కేర్ బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్నవారు ఇంటి నుంచి ఇతర వ్యాపారాలు చేసి ఉపాధి పొందాలని అనుకునే వారు ఈ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనే ఆలోచన ఉంటే ఈ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కీమ్స్ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తాయి.
మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం
దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ స్కీమ్స్ ద్వారా మహిళలు తమ కలలను నెరవేర్చుకునే అవకాశం కల్పిస్తోంది. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.