ప్లీస్ సర్.. ఆఫీసుకు పిలవండి.. వర్క్ ఫ్రం హోంపై నైరాశ్యంలో ఉద్యోగులు

ఎక్కువగా తింతే గారెలైనా చేదొస్తాయంటారు పెద్దలు.. ఈ సామెతిప్పుడు వర్క్ ఫ్రం హోం చేసేవారికి కొట్టొచ్చినట్లు సరిపోతోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దేశంలో అడుగుపెట్టిన తరువాత చాలా వరకు ప్రయివేటు కంపెనీలు మూత పడ్డాయి. ఉద్యోగులను ఇంటినుంచే పనులు చేయాలని ఉత్తర్వులు ఇచ్చాయి. అబ్బా.. ఇంట్లోంచి పని చేయడమంటే.. చాలా హాయిగా ఉంటుందని అనుకున్నారు చాలా మంది ఉద్యోగులు.. మొదట్లో ఎంతో అనందం వ్యక్తం చేశారు. దాదాపు ఏడాదికాలంగా ఇంట్లోనే ఉండి ఆఫీసు విధులు నిర్వహిస్తుండడంతో […]

Written By: Srinivas, Updated On : February 21, 2021 12:49 pm
Follow us on


ఎక్కువగా తింతే గారెలైనా చేదొస్తాయంటారు పెద్దలు.. ఈ సామెతిప్పుడు వర్క్ ఫ్రం హోం చేసేవారికి కొట్టొచ్చినట్లు సరిపోతోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దేశంలో అడుగుపెట్టిన తరువాత చాలా వరకు ప్రయివేటు కంపెనీలు మూత పడ్డాయి. ఉద్యోగులను ఇంటినుంచే పనులు చేయాలని ఉత్తర్వులు ఇచ్చాయి. అబ్బా.. ఇంట్లోంచి పని చేయడమంటే.. చాలా హాయిగా ఉంటుందని అనుకున్నారు చాలా మంది ఉద్యోగులు.. మొదట్లో ఎంతో అనందం వ్యక్తం చేశారు. దాదాపు ఏడాదికాలంగా ఇంట్లోనే ఉండి ఆఫీసు విధులు నిర్వహిస్తుండడంతో మాకొద్దు బాబోయ్.. ఈ ఇంటి నుంచి పని… అని గగ్గోలు పెడుతున్నారు. ఆఫీసుకు పిలవండి అక్కడి నుంచే పని చేస్తామని చెప్పుకొస్తున్నారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని.. ఇంటి నుంచి పని కన్నా.. ఆఫీసులో కొద్ది గంటల్లో పూర్తి చేయడం చాలా సులభం అని చెబుతున్నారు పలువురు ప్రయివేటు ఉద్యోగులు.

Also Read: వాట్సాప్ ప్రైవసీ పాలసీ అప్పటినుంచే.. వాళ్లు మెసేజ్ లు పంపలేరట..?

ఇంట్లో పని వాతావరణం ఉండదనే భావన చాలా మందిలో వచ్చేసింది. ప్రాజెక్టులో సభ్యులందరూ కలిసి బృందంగా పనిచేసేవారు. దాదాపు ఏడాది కాలంగా ఒంటరిగా వర్క్ చేయడం ఇప్పుడు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. మానసికంగా ఒత్తిళ్లకు గురి అవుతున్నారు. ఇంకొందరు ఇంట్లో సరైన సదుపాయాలు లేక, సమకూర్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు పనికి ఆటంకం కలిగిస్తున్నారని చెబుతున్నారు. పడక గదుల్లో బెడ్ మీద కూర్చుని పని చేయడం వల్ల చాలా మందిలో వెన్ను నొప్పి వస్తోందని.. మెడనొప్పి బాధ పెడుతుందని అంటున్నారు. బయటకు వెళ్లలేక ఎక్కువసేపు ఇంట్లోనే ఉండి పని చేయడం వల్ల చాలామందిలో డీ విటమిన్ లోపం తలెత్తుతోంది. ఇవన్నీ తమ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని పలువురు ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు.

Also Read: ఆ దేశంలో రూపాయికే లీటర్ పెట్రోల్.. ఎక్కడంటే..?

ఇదే విషయమై దేశవ్యాప్తంగా టైమ్స్ జాబ్ సర్వే నిర్వహించింది. మొత్తం 1376మంది మానవ వనరుల విభాగం మేనేజర్లతో మాట్లాడింది. వారు నివేదించని వివరాల ప్రకారం.. కరోనా నేపథ్యంలో మరికొంతకాలం ఇంటి నుంచే పని చేయాలని 42శాతం మంది కోరుకుంటున్నారు. రెండు విధాలు అనుసరించాలని 40శాతం మంది కోరుతున్నారు. వర్క్ ఫ్రం హోకు స్వస్తి చెప్పాలని 18శాతం కంపెనీలు అనుకుంటున్నాయి.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

అయితే తమ ఉద్యోగులను ఇంటినుంచే పని చేయాలని చెప్పడంతో కంపెనీలకు కలిసివస్తోంది. మామూలుగా ఒక ఉద్యోగి మౌలిక వసతులకు కంపెనీ భారీగా అలవెన్సు కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోంతో ఒక్కో ఉద్యోగిపై రూ.7 నుంచి పదివేల వరకు మిగులుతున్నాయి. ఉద్యోగులు ఎక్కువగా సెలవు తీసుకోవడానికి అవకాశం ఉండదు.. 24 గంటలు తన విధులు నిర్వహించేలా అందుబాటులో ఉంటారని సంస్థలు అనుకుంటున్నాయి. అయితే ఇప్పటికే ఏడాది కాలంగా ఇంటినుంచి పనులు చేస్తున్నాం.. ఆఫీసుకు పిలవండని ఉద్యోగులు అంటుంటే… అది అదనపు ఖర్చు అని ఇంటి నుంచే పని చేసేలా కంపెనీలు ఉద్యోగులకు సూచనలు ఇస్తున్నాయి.