HomeజాతీయంMutton Politics In Bihar: ఉచితంగా మటన్.. కోరినంత కీమా.. ఇవీ బీహార్ నాయకుల ఎన్నికల...

Mutton Politics In Bihar: ఉచితంగా మటన్.. కోరినంత కీమా.. ఇవీ బీహార్ నాయకుల ఎన్నికల హామీలు!

Mutton Politics In Bihar: అప్పట్లో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఓ నియోజకవర్గానికి ఉపఎన్నికలు వచ్చాయి.. ఓ పార్టీ అభ్యర్థి నియోజకవర్గంలో దాదాపు 45 రోజులపాటు ఉచితంగా చికెన్ పంపిణీ చేశారు. తన క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు చికెన్ బిర్యాని తయారు చేయించి కార్యకర్తలకు వడ్డించారు. అప్పట్లో ఇది ఒక హాట్ టాపిక్. సాధారణంగా ఎన్నికల్లో నాయకులు ఓటర్లకు డబ్బులు ఇస్తారు.. ఇతర కానుకలిస్తారు. కానీ ఆయన మాత్రం చికెన్ ను మాత్రమే నమ్ముకున్నారు. చికెన్ ను నమ్ముకుని విజయం సాధించారు.. డబ్బులకంటే, విలువైన కానుకల కంటే కక్కా, ముక్కనే జనం ఇష్టపడతారని ఆ ఉదంతంతో రూడీ అయింది. ఇప్పుడు తెలంగాణ కల్చర్ బీహార్ కు పాకినట్టుంది.

Also Read: కాంగ్రెస్ లో లేకున్నా నాకు సీఎం సీటు ఎందుకొచ్చిందంటే?.. బయటపెట్టిన రేవంత్

బీహార్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అక్కడి రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. అధికార పార్టీ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో బిజీబిజీగా ఉంటే.. ప్రభుత్వ తప్పులను ఎండగట్టడంలో ప్రతిపక్షం బిజీబిజీగా ఉంది. అయితే ఇందులో కొంతమంది నాయకులు ఒక అడుగు ముందుకు వేసి బీహార్ ప్రజలలో సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మటన్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ నియోజకవర్గంలో ఓ పార్టీ నాయకుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. శాకాహారం వల్ల ఆరోగ్యం బాగుంటుందని పేర్కొన్నారు. ఇదే అదునుగా మరో పార్టీ నాయకుడు.. శాకాహార పార్టీకి ఓట్లు వేస్తే ఉపయోగం ఉండదని.. తమది పూర్తిగా నాన్ వెజ్ పార్టీ అని.. నాన్ వెజ్ తినే వాళ్ళు తమకు ఓటు వేయాలని సూచించారు.. ఇది ఇక్కడితోనే అయిపోలేదు.. ఇక మరో స్థానంలో మరో నాయకుడు మాట్లాడుతూ..”ప్రస్తుతం అక్రమాలు పెరిగిపోయాయి. అవినీతి విపరీతంగా ఉంది. ఇవన్నీ తగ్గిపోవాలంటే నన్ను గెలిపించాలి. నన్ను గెలిపిస్తే విపక్షాలను మటన్ కీమా చేస్తానని” ఓ పార్టీ నాయకుడు వ్యాఖ్యానించాడు. నాన్ వెజ్, వెజ్ వ్యాఖ్యలు సృష్టించిన సంచలనం మర్చిపోకముందే.. మటన్ కీమా వ్యాఖ్యలు మరింత రగడ కలిగించాయి..

మరో స్థానంలో టికెట్ ఆశిస్తున్న ఓ వ్యక్తి ఒక అడుగు ముందుకు వేశారు. తనను ఆ నియోజకవర్గంలో గెలిపిస్తే మటన్ కీమా ఉచితంగా పంచుతానని హామీ ఇచ్చారు.. అంతేకాదు నాణ్యమైన పొట్టేళ్ల మాంసం అందిస్తానని ప్రకటించారు. ఈ ప్రకటనలు ఓటర్లను మచ్చిక చేసుకోవడం కోసమే నాయకులు అంటున్నారు.. బీహార్ ప్రజలు మటన్ ప్రియులు. ముఖ్యంగా అక్కడి చంపారన్ స్టైల్ మటన్ కర్రీ చాలా ఫేమస్. వాస్తవానికి మనదేశంలో చికెన్ వినియోగం చాలా ఎక్కువ. కానీ బీహార్ రాష్ట్రంలో ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. అక్కడి ప్రజలు చికెన్ కంటే ఎక్కువగా మటన్ ఇష్టపడుతుంటారు. మటన్ వినియోగంలో బీహార్ రాష్ట్రం ముందు వరసలోనే ఉంటుంది. పైగా అక్కడ మేకపోతులు, గొర్రెపోతులు విరివిగా లభ్యమవుతుంటాయి. అక్కడ వాటి సంఖ్య ఎక్కువ కాబట్టి వినియోగం కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందువల్లే జనాల మైండ్ సెట్ పసిగట్టిన రాజకీయ నాయకులు “మటన్” సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ.. ముందుగానే మేలుకోవాలి అనే ఉద్దేశంతో నేతలు ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజంగా ఈ మటన్ వ్యాఖ్యలు ప్రజలను కదిలిస్తాయా.. ఓటు వేసేలా చేస్తాయా.. ఎన్నికల్లో గెలిపిస్తాయా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే బీహార్ ప్రజలు నాయకులు అంచనా వేసుకున్నంత అమాయకులు కాదు. వారికి విచక్షణ ఉంది. ఈ నాయకుడైతే తమను అభివృద్ధి చేస్తారో ఒక అంచనా ఉంది.. గతంలో జరిగిన పరిణామాలు దీనికి ఉదాహరణ. గడచిన కొన్ని పర్యాయాలుగా బీహార్ రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా వన్ సైడ్ విక్టరీ అందించలేదంటే అక్కడి ప్రజలు ఎలాంటి విజ్ఞులో అర్థం చేసుకోవచ్చు. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్.. బిజెపి..ఇలా ఏ పార్టీ చూసుకున్నా.. వేటికీ భారీగా స్థానాలు ఇవ్వలేదు. అలాగని చీత్కరించలేదు. మరి ఈసారి ఇలాంటి ఫలితాలు ఇస్తారో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular