AP Liquor Scam: ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam ) జాతీయస్థాయిలో కూడా చర్చకు దారితీస్తోంది. దేశంలో ఎక్కడా జరగని విధంగా.. ఏపీలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని దర్యాప్తులో తేలింది. ఒకటి కాదు రెండు కాదు రూ.3,500 కోట్లు నాటి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు లూటీ చేశారని తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఇప్పటివరకు మద్యం కుంభకోణాలు జరిగాయి కానీ.. ఈ స్థాయిలో కుంభకోణం జరగడం.. భారీగా నిధులు పక్కదారి పట్టించడం.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం ఇంతవరకు జరగలేదు. జగన్ జమానాలోనే దేశంలో అతిపెద్ద కుంభకోణం ఇది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేషనల్ మీడియాలో సైతం ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. దీంతో ఏపీలో ఈ స్థాయి కుంభకోణం జరిగిందా? అన్న చర్చ అయితే జాతీయస్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతోంది.
Also Read: ఏపీలో ‘పట్టా’లెక్కనున్న మెట్రో!
సీఎంలు సైతం అరెస్ట్..
ఇంతకుముందు ఢిల్లీ మద్యం కుంభకోణం( Delhi liquors com) , చత్తీస్గడ్ లిక్కర్ స్కాం బయటకు వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రుల హోదాలో ఉన్నవారు సైతం అరెస్టయ్యారు. ఢిల్లీలో రూ.100 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగింది. ప్రభుత్వ కార్పొరేషన్ల ఆధీనంలో ఉన్న మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు వ్యక్తులకు బదలాయించారు. 12 శాతం లాభాన్ని కట్టబెట్టారు. తద్వారా ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ.100 కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నారు. అలా వచ్చిన సొమ్మును పంజాబ్ తో పాటు గోవా ఎన్నికల్లో వినియోగించారన్నది ప్రధాన అభియోగం. ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి తో పాటు ఈ కుంభకోణంలో సంబంధం ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు అరెస్టయ్యారు. దేశంలోనే ఇది ప్రకంపనలు సృష్టించింది. అప్పటివరకు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ఈ ఆరోపణలతోనే దారుణ ఓటమి చవిచూసింది.
చత్తీస్గడ్ లో భారీ కుంభకోణం..
చత్తీస్గడ్ లో( Chhattisgarh) సైతం భారీ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగింది. రూ.2,161 కోట్ల స్కామ్ జరిగిందన్నది ప్రధాన అభియోగం. అప్పటివరకు ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం వ్యాపారం నడిచేది. కానీ నేతలు సిండికేట్ గా మారి మద్యం కంపెనీలను తమ చెప్పు చేతల్లోకి తీసుకొని.. మద్యం కేసుకు 150 వరకు కమీషన్ తీసుకునేవారు. తద్వారా భారీగా లబ్ధి పొందారు. అయితే ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలకు కాదని ఏపీ మద్యం కుంభకోణం రికార్డు సృష్టించింది. ఏకంగా రూ.3500 కోట్లు కుంభకోణం జరిగినట్లు స్పష్టం అవుతోంది. ఏకంగా ఏపీ ప్రభుత్వానికి 18 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయానికి గండి కొట్టినట్లు విచారణలో తేలింది.
Also Read: ఏపీలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. నాలుగు రోజుల పాటు డేంజర్!
తొలుత తేలిగ్గా తీసుకున్న వైసీపీ..
అయితే మద్యం కుంభకోణం కేసును వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress party) పార్టీ తేలిగ్గా తీసుకుంది. అసలు ఈ కేసు నిలబడదని భావించింది. కానీ మూలాలకు వెళ్లి శూల శోధన చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది సాక్షులను విచారించింది. మొత్తం స్కెచ్ హైదరాబాదులో జరిగినట్లు స్పష్టం అవుతుంది. మరోవైపు అప్పటి తెలంగాణ ప్రభుత్వంలో కీలక వ్యక్తుల సైతం ఇందులో ప్రవేశించారని కూడా విచారణలో తేలింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అసలు విషయం తెలిసింది. జగన్మోహన్ రెడ్డి సైతం రాజకీయ కార్యకలాపాలను పక్కనపెట్టి.. మద్యం కుంభకోణం పైనే దృష్టి పెట్టారని.. దీని నుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అందుకే ఈ వారం ఆయన తాడేపల్లి ప్యాలెస్ కు కూడా రాలేదని తెలుస్తోంది. చూడాలి ఈ కుంభకోణం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలా బయటపడతారో..!