Jr NTR Dragon Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు. మరి ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే ఏర్పాటు చేసి పెట్టాయి. ప్రస్తుతం ఆయన వార్ 2(War 2)సినిమాతో ప్రేక్షకుడి ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ (Dragon) సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమా చేసిన కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఆయన డ్రాగన్ సినిమాతో కంప్లీట్ గా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నింటినీ తిరగ రాస్తాడని అతని అభిమానులు చాలా కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ సాధిస్తే ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరో రేస్ లో కొనసాగుతాడు.లేకపోతే మాత్రం ఆయన నెంబర్ వన్ రేస్ నుంచి తప్పుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇంతకుముందు ఆయన చేసిన దేవర (Devara) సినిమా 500 కోట్ల వరకు కలెక్షన్స్ ను అయితే సంపాదించింది.
Also Read: అయ్యో నిధి.. మళ్ళీ మొదటికి! ప్రభాస్ అయినా కాపాడేనా?
తన తోటి హీరోలందరూ 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడుతుంటే ఆయన మాత్రం ఇంకా 500 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. దాంతో చాలామంది ఎన్టీఆర్ కి మిగతా స్టార్ హీరోల మాదిరిగా మార్కెట్ అయితే లేదని కామెంట్లు చేస్తున్నారు. దీన్ని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ (Dragon) సినిమాతో ఎన్టీఆర్ సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తేనే ఆయన మార్కెట్ తో పాటు ఆయన క్రేజ్ కూడా టాప్ లెవెల్ కి వెళ్తుంది. లేకపోతే మాత్రం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Also Read: నాగ వంశీ కి ఎన్టీఆర్ అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా..?
ఇక ఈ రెండు సినిమాల తర్వాత ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్ లో మైథాలాజికల్ నిమాను చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తొందర్లోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…