Extramarital affair: తల్లి అక్రమసంబంధం.. కొడుకుకు వింత వ్యాధి

చేసిన తప్పు ఏనాటికైనా బయటపడుతుంది. భార్య పెళ్లి అయిన తరువాత ఏర్పరుచుకున్న అక్రమ సంబంధం తాలూకు నిజం పుట్టిన కొడుకుకు వచ్చిన వ్యాధి ఆధారంగా బయటపడడం వింతే. కానీ ఇది నిజం. దాంపత్యంలో దాపరికాలు ఉండకూడదని అంటారు. కానీ ఆ భార్య దాచడంతో ఆ నిజం ఎన్ని రోజులైనా సరే తన గుర్తును బయటపెట్టింది. దీంతో ఆ దంపతుల్లో అనుమానం అనే పెను బీజం పడింది. భార్యచేసిన తప్పుకు తమ సంతానం బలి కావడం యాదృచ్చికంగానే జరిగినా […]

Written By: Srinivas, Updated On : August 14, 2021 5:05 pm
Follow us on

చేసిన తప్పు ఏనాటికైనా బయటపడుతుంది. భార్య పెళ్లి అయిన తరువాత ఏర్పరుచుకున్న అక్రమ సంబంధం తాలూకు నిజం పుట్టిన కొడుకుకు వచ్చిన వ్యాధి ఆధారంగా బయటపడడం వింతే. కానీ ఇది నిజం. దాంపత్యంలో దాపరికాలు ఉండకూడదని అంటారు. కానీ ఆ భార్య దాచడంతో ఆ నిజం ఎన్ని రోజులైనా సరే తన గుర్తును బయటపెట్టింది. దీంతో ఆ దంపతుల్లో అనుమానం అనే పెను బీజం పడింది. భార్యచేసిన తప్పుకు తమ సంతానం బలి కావడం యాదృచ్చికంగానే జరిగినా చివరికి మాత్రం కొడుకు బాధ్యుడు కావడం సంచలనం కలిగించింది.

ఇరవై సంవత్సరాల క్రితం తనకు పెళ్లికాక ముందు చేసిన తప్పు తాజాగా బయటపడింది. దీంతో అది తన వల్లే అని ఒప్పుకున్న సంఘటన ఒరిస్సాలో జరిగింది. అయితే వారికి ఓ కుమారుడు పుట్టాడు. అతడికి వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అయిన కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నాడు. దానికి వైద్యం అందక చాలా రోజులు అవస్థలు పడుతున్నాడు. కొడుకు బాధ చూడలేని తండ్రి ఎలాగైనా మెరుగైన వైద్యం అందించాలని ఓ పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు.

అతడిని పరిశీలించిన వైద్యులు సికిల్ సెల్ అనిమియా అనే కీళ్లకు సంబంధించిన వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుందని వైద్యులు చెప్పారు. తల్లిదండ్రులను ఇద్దరికి కూడా టెస్టులు చేశారు. అయితే వ్యాధి లక్షణాలు తల్లిలో మాత్రమే ఉన్నాయని తేలింది. కానీ తండ్రిలో ఆ లక్షణాలు లేవు. దీంతో వైద్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఇదే విషయంపై భర్త భార్యను నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. పెళ్లి తరువాత తాను ఓ వ్యక్తిని తరచు కలిసే దానినని పేర్కొంది. అతడికి ఈ వ్యాధి ఉండవచ్చని తెలిపింది. బాబు కూడా అతడి వల్లే పుట్టాడని రహస్యం చిక్కుముడి విప్పింది. దీంతో ఆమె ప్రియుడికి ఉన్న వ్యాధే కొడుకుకు వచ్చి ఉంటుందని వైద్యులు వెల్లడించారు.