Modi global image: భారత ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే విశ్వగురువుగా కీర్తి పొందారు. వివిధ దేశాలతో ఆయన కొనసాగిస్తున్న సత్సంబంధాలు, అందిస్తున్న సాయం, భారత విదేశాంగ విధానం.. మోదీని అనేక దేశాలకు దగ్గర చేసింది. పేద దేశాలకు వీలైన సాయం చేయడంతోపాటు సంపన్న దేశాలతోనూ వ్యాపార సంబంధాల బలోపేతం, సాంకేతిక, సైనిక సహకారం కొనసాగిస్తుండడంతో చాలా మందికి మోదీపై గౌరవం పెరుగుతోంది. దీంతో గడిచిన 11 ఏళ్ల కాలంలో మోదీకి 24 దేశాలు అత్యున్నత పురస్కారాలు ప్రదానం చేశాయి.
ఐదు దేశాల పర్యటనకు..
మోదీ ఐదు దేశాల పర్యటనకు జూర్ 2న బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలో మొదట ఘన దేశంలో పర్యటించారు. ఆ దేశం కూడా మోదీకి తమ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేసింది. ఇది ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన 24వ అవార్డుగా నిలిచింది. ఈ పురస్కారం భారత్–ఘనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతోపాటు, ఆఫ్రికా ఖండంలో భారత్ యొక్క ప్రభావాన్ని సూచిస్తుంది. ఘనా అధ్యక్షుడు మోదీ నాయకత్వాన్ని, భారత్ ఆర్థిక సంస్కరణలను, గ్లోబల్ సౌత్ దేశాలకు మద్దతును ప్రశంసించారు.
Also Read: ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో మూడు నెలలకు ఒకసారి చెల్లింపులు!
24 దేశాల గుర్తింపు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూఏఈ, సౌదీ అరేబియా, భూటాన్, మాల్దీవ్స్, నైజీరియా, శ్రీలంక, ఫిజీ వంటి 24 దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు లభించాయి. ఈ దేశాల జాబితా భౌగోళికంగా విభిన్నమైనది, ఇందులో ఆసియా, ఆఫ్రికా, యూరప్, అమెరికా, ఓషియానియా ఖండాలు ఉన్నాయి. ఈ గుర్తింపు భారత విదేశాంగ విధానం, ఆర్థిక సంస్కరణలు, గ్లోబల్ లీడర్‌షిప్‌లో మోదీ పాత్రను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలైన నైజీరియా, మారిషస్, గయానా వంటి దేశాలు మోదీ అంతర్జాతీయ సహకారానికి గుర్తింపుగా ఈ పురస్కారాలు అందజేశాయి.
Also Read: ఆ వైసీపీ కీలక నేతకు అండగా కూటమి ఎంపీలు?
పురస్కారాల వెనుక దౌత్య ప్రాముఖ్యత..
ఈ 24 పురస్కారాలు భారత్ దౌత్య విజయాలను, మోదీ నాయకత్వ శైలిని ప్రతిబింబిస్తాయి. అగ్రరాజ్యం అమెరికా నుంచి లభించిన ‘లీజన్ ఆఫ్ మెరిట్‘ భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, రష్యా నుంచి లభించిన ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ‘ భారత్–రష్యా దీర్ఘకాల సంబంధాలను బలోపేతం చేస్తాయి. అదేవిధంగా, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాల నుంచి అవార్డులు భారత్ లుక్ ఈస్ట్, ఆక్ట్ వెస్ట్ విధానాలకు గుర్తింపుగా నిలుస్తాయి. ఈ పురస్కారాలు భారత్ యొక్క ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సహకారాన్ని ప్రోత్సహించడంలో మోదీ చొరవను సూచిస్తాయి.