https://oktelugu.com/

ఇల్లు కొనాలనుకునే వాళ్లకు మోదీ సర్కార్ శుభవార్త.. ?

మనలో చాలామందికి సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఉంటుంది. అయితే రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులు, భవన నిర్మాణ కార్మికుల వేతనాలు భారీగా పెరగడం వల్ల చాలామంది సొంతింటి కలను నెరవేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఇల్లు కొనాలనుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కరోనా, లాక్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్రం, బ్యాంకులు మంచి ఆఫర్లను అందుబాటులోకి తెచ్చాయి. సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ఉద్యోగులకు, వ్యాపారులకు, ఇతరులకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 17, 2020 / 08:32 AM IST
    Follow us on


    మనలో చాలామందికి సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఉంటుంది. అయితే రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులు, భవన నిర్మాణ కార్మికుల వేతనాలు భారీగా పెరగడం వల్ల చాలామంది సొంతింటి కలను నెరవేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఇల్లు కొనాలనుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కరోనా, లాక్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్రం, బ్యాంకులు మంచి ఆఫర్లను అందుబాటులోకి తెచ్చాయి.

    సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ఉద్యోగులకు, వ్యాపారులకు, ఇతరులకు ఇదే సరైన సమయమని చెప్పాలి. కేంద్రం కొత్తగా ఇళ్లు కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు ఆదాయపు పన్ను ప్రయోజనాలను అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సర్కిల్ రేటు, మార్కెట్ రేటు మధ్య వ్యత్యాసాన్ని 20 శాతానికి పెంచడంతో కొత్త ఇంటిని కొనుగోలు చేసే వాళ్లు సర్కిల్ రేటు కంటే 20 శాతం తక్కువకే ఇంటిని కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి.

    దీంతో పాటు కేంద్రం కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. కొత్త ఇల్లు కొనుగోలు కోసం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ద్వారా ఎవరైతే బ్యాంక్ లోన్ ను పొందుతారో వాళ్లు వడ్డీ రాయితీని కూడా పొందే అవకాశం ఉంది. దీంతో ఇల్లు కొనుగోలు చేసిన వాళ్లకు భారీగా ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయి.

    బ్యాంకులు సైతం తక్కువ వడ్డీకే వినియోగదారులకు హోం లోన్ అందిస్తున్నాయి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.9 శాతం వడ్డీ రేటుకే హోం లోన్ లను అందిస్తోంది. పలు బ్యాంకులు హోమ్ లోన్లపై ప్రాసెసింగ్ ఫీజును సైతం మాఫీ చేస్తున్నాయి. అందువల్ల హోం లోన్ తీసుకోవడానికి ఇదే సరైన సమయమని చెప్పాలి.