https://oktelugu.com/

జోబైడెన్‌.. భారత్‌ను కలుపుకొని పోవాల్సిందేనా?

ఎంతో ఉత్కంఠ మధ్య అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికయ్యారు. మరో రెండు నెలల్లో 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే.. బైడెన్‌ పాలనపై ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అగ్రరాజ్యాన్ని ఆయన ఎలా నడిపిస్తారు.. అమెరికాకు అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు.. అన్న చర్చ అంతటా నడుస్తోంది. దేశ చరిత్రలోనే అతి పెద్ద వయస్కుడైన అధ్యక్షుడు అనుసరించే విధానాలు, అవి తమపై చూపే ప్రభావం గురించి అంతర్గతంగా అన్ని దేశాలూ సమీక్షించుకుంటున్నాయి. అయితే […]

Written By:
  • NARESH
  • , Updated On : November 17, 2020 / 08:28 AM IST
    Follow us on

    ఎంతో ఉత్కంఠ మధ్య అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికయ్యారు. మరో రెండు నెలల్లో 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే.. బైడెన్‌ పాలనపై ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అగ్రరాజ్యాన్ని ఆయన ఎలా నడిపిస్తారు.. అమెరికాకు అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు.. అన్న చర్చ అంతటా నడుస్తోంది. దేశ చరిత్రలోనే అతి పెద్ద వయస్కుడైన అధ్యక్షుడు అనుసరించే విధానాలు, అవి తమపై చూపే ప్రభావం గురించి అంతర్గతంగా అన్ని దేశాలూ సమీక్షించుకుంటున్నాయి. అయితే అమెరికాకు ఆ దేశ ప్రయోజనాలే ముఖ్యం. అంతేతప్ప ఇతర దేశాల కోసం తన ప్రయోజనాలను ఫణంగా పెట్టదు. ఇప్పటివరకు దేశాధినేతలూ ఇదే విధానంతో ముందుకెళ్లారు. బైడెన్ ఇందుకు మినహాయింపేమీ కాదు.

    Also Read: చీఫ్ జస్టిస్ కు లేఖ: జగన్ కోర్టు ధిక్కరణ కేసులో భారీ ట్విస్ట్

    భారత్‌కు సంబంధించి పెద్దగా మార్పులు వచ్చే అవకాశం లేదన్నది దౌత్య నిపుణుల అభిప్రాయం. ఉభయ దేశాల సంబంధాలు బలపడగా.. వ్యక్తులతో సంబంధం లేకుండా అవి కొనసాగుతూనే ఉంటాయి. అక్టోబరు ఆఖరులో అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రుల భారత్‌లో చేసిన పర్యటనే ఇందుకు నిదర్శనం. ఓ పక్క దేశం ఎన్నికల హడావిడిలో ఉన్నప్పటికీ ఇద్దరు కీలక మంత్రులను భారత్ పర్యటనకు పంపడం.. మన దేశానికి అగ్రదేశం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం.

    బైడెన్ పరంగా చూస్తే భారత్ వ్యవహారాలు బరాక్ ఒబామా హయాంలో 2008 నుంచి 2016 వరకు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన తెరవెనక విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆయన కుడి భుజమైన ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ భారతీయ మూలాలున్న మహిళ. ప్రవాస భారతీయులు తాజా ఎన్నికల్లోనూ డెమొక్రటిక్ పార్టీ వైపు నిలబడ్డారు. బైడెన్‌కు భారత్‌లో బంధువులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు న్యూఢిల్లీ పట్ల స్నేహపూరితంగా ఉంటారు. భారత్‌కు ఎంత దగ్గరవుతారనేది పక్కన పెడితే దూరమయ్యే అవకాశం ఏ మాత్రం లేదన్నది సుస్పష్టం.

    Also Read: రూ.310 కోట్ల ఖర్చా.. ధనిక రాష్ట్రమా మాజాకా?

    మానవహక్కుల ఉల్లంఘన, కశ్మీర్ సమస్యపై న్యూఢిల్లీకి, వాషింగ్టన్ మధ్య కొంత తేడా లేకపోలేదు. జమ్మూ-కశ్మీర్‌‌లో 370వ అధికరణ రద్దును స్వయంగా కమలా హారిస్ వ్యతిరేకించారు. అయితే.. నరేంద్ర మోడీకి డొనాల్డ్ ట్రంప్‌నకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ ట్రంప్‌ గెలుపును కోరుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసమే అమెరికాలో ‘హౌడీ-మోడీ’ అహ్మదాబాద్ లో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాలు నిర్వహించారన్న వాదనలూ ఉన్నాయి. చైనాను ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా ట్రంప్ భారత్‌కు అధిక ప్రాధాన్యమిచ్చారనేది ఓపెన్‌ సీక్రెట్‌. కానీ.. ఈ విషయంలో బైడెన్ ఎలా వ్యవహరిస్తారో ఆసక్తికరంగా మారింది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    వామపక్ష భావాలు గల బైడెన్ చైనా పట్ల ట్రంప్‌లా కఠినంగా ఉండరన్న వాదన ఉంది. అయితే అదే సమయంలో తనకు దీటుగా ఎదుగుతున్న చైనాను నియంత్రించడం బైడెన్ ముందున్న కర్తవ్యం. ఈ విషయంలో అమెరికన్ల వైఖరికి భిన్నంగా ముందుకుపోలేరు. కమలా హారిస్ ఎంతగా భారతీయ మూలాలున్న వ్యక్తి అయినప్పటికీ అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించలేరు. ట్రంప్‌కు భిన్నంగా వీసాల మంజూరులో ఒకింత ఉదారంగా వ్యవహరించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. పాకిస్థాన్ పట్ల కూడా బైడెన్ విధానంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. అయితే.. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అమెరికాకు మాత్రం భారత్‌ను కలుపుకొని పోవాల్సిన అవసరం మాత్రం ఉంది. అదే టైంలో చైనాను నియంత్రించాల్సిన అవసరం ఇద్దరికీ ఉంది. మొత్తంగా చూస్తే అంతిమంగా ఇరు దేశాలూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.