https://oktelugu.com/

అల్లం టీ తాగుతున్నారా… అయితే ప్రమాదంలో పడ్డట్టే..?

కరోనా వైరస్ విజృంభణ తరువాత ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తినడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్థాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. కరోనా, లాక్ డౌన్ సమయంలో ఇమ్యూనిటీని పెంచే అల్లం టీకి డిమాండ్ భారీగా పెరిగింది. అయితే అల్లం టీ తాగడం మంచిదే అయినా ఎక్కువగా తాగితే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవని తెలుస్తోంది. వైద్యులు మోతాదుకు మించి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 17, 2020 / 08:38 AM IST
    Follow us on


    కరోనా వైరస్ విజృంభణ తరువాత ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తినడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్థాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. కరోనా, లాక్ డౌన్ సమయంలో ఇమ్యూనిటీని పెంచే అల్లం టీకి డిమాండ్ భారీగా పెరిగింది. అయితే అల్లం టీ తాగడం మంచిదే అయినా ఎక్కువగా తాగితే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవని తెలుస్తోంది.

    వైద్యులు మోతాదుకు మించి అల్లం టీ తాగితే ఇబ్బందులు పడక తప్పదని చెబుతున్నారు. అల్లం టీ అతిగా తాగితే అతిసారం సమస్య బారిన పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అల్లం టీకి దూరంగా ఉండాలి. వైద్యులు గర్భిణీ స్త్రీలు అల్లం ఎక్కువగా తీసుకుంటే కొన్నిసార్లు గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుందని.. గర్భిణీ స్త్రీలు అల్లం ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిదని చెబుతున్నారు.

    అల్లంలో యాంటీ ప్లేట్‌లెట్ గుణాలు ఉంటాయి. అల్లం ఎక్కువగా తీసుకుంటే రక్తం చిక్కగా మారే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే రక్తానికి సంబంధించిన సమస్యలతో బాధ పడుతుంటే అల్లం ఆ సమస్యలను మరింత పెంచుతుంది. లో బీపీ సమస్యతో బాధ పడే వాళ్లు అల్లం టీ తీసుకుంటే వారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అల్లం టీ జుట్టు పెరుగుదలపై కూడా ప్రభావం చూపుతుందని ఒక అధ్యయనంలో తేలింది.

    జుట్టు సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న వాళ్లు అల్లం టీకి వీలైనంత దూరంగా ఉంటే మంచిది. అల్లం అతిగా తీసుకుంటే జుట్టు పెరగడం ఆగిపోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం.