Kerala Woman: నమ్మి వచ్చిన యువతిపై మద్యం తాగించి గ్యాంగ్ రేప్.. షాకింగ్ నిజాలు

Kerala Woman: నమ్మకం అనేది మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. అందులోనే మోసపోతూ తమ జీవితాన్ని శిథిలం చేసుకుంటున్నారు. విశ్వాసం అనే మాయలో పడి సర్వస్వం కోల్పోతున్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావంతో ప్రపంచం చిన్నదైపోతోంది. పరిచయాలతో పెను ప్రమాదాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాతో మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతోంది. నమ్మకంతోనే మహిళలే ఎక్కువగా నష్టపోతున్నారు. ఏదో స్నేహితుడే కదా అని నమ్మితే స్నేహితురాలిని నిలువునా దోచుకుని నష్టం చేశాడు. తనే కాకుండా తన స్నేహితులను కూడా […]

Written By: Srinivas, Updated On : September 12, 2021 12:07 pm
Follow us on

Kerala Woman: నమ్మకం అనేది మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. అందులోనే మోసపోతూ తమ జీవితాన్ని శిథిలం చేసుకుంటున్నారు. విశ్వాసం అనే మాయలో పడి సర్వస్వం కోల్పోతున్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావంతో ప్రపంచం చిన్నదైపోతోంది. పరిచయాలతో పెను ప్రమాదాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాతో మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతోంది. నమ్మకంతోనే మహిళలే ఎక్కువగా నష్టపోతున్నారు. ఏదో స్నేహితుడే కదా అని నమ్మితే స్నేహితురాలిని నిలువునా దోచుకుని నష్టం చేశాడు. తనే కాకుండా తన స్నేహితులను కూడా ఇందులో భాగస్వాములను చేసి ఆమెను కానిదాన్ని చేశాడు.

కేరళలోని కొల్లాంకు చెందిన ఓ యువతి దాదాపుగా రెండేళ్లుగా ఒకరిని నమ్మింది. అతడితో స్నేహం చేసింది. ఆన్ లైన్ లో కోజికోడ్ కు చెందిన అనాస్ అనే యువకుడితో చనువు పెంచుకుంది. తన మాటలు విశ్వసించింది. ఫోన్ లో సంభాషించుకున్నారు. అయితే ఇటీవల ఆ యువకుడు ఆమెను కోజికోడ్ కు రావాలని ఆహ్వానించాడు. దానికి ఆమె ససేమిరా అన్నా బతిమాలి ఒప్పించాడు. అనుకున్న పథకం ప్రకారం ఆమెను బలిచేయాలని కుట్ర పన్నాడు. ఇవేమీ తెలియని ఆమె అక్కడికి చేరుకుంది.

కొల్లాం నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లెక్కచేయకుండా ప్రయాణం చేసి మరీ యువతి అక్కడికి వెళ్లింది. ఆమెను రిసీవ్ చేసుకున్న అనాస్ ఓ ప్లాట్ కు తీసుకెళ్లాడు. తరువాత తన ముగ్గురు స్నేహితులను ఆహ్వానించాడు. వీరెవరని అడిగితే తన ప్రాణస్నేహితులని చెప్పి చిన్న పార్టీ అని ఆమెతో తాగించారు. అనంతరం డ్రగ్స్ కూడా ఎక్కించి ఆమెపై అత్యాచారం చేశారు. నమ్మినందుకు ఆమెను మోసం చేసి తన కోరిక తీర్చుకోవడం సంచలనం సృష్టించింది.

దీంతో అత్యాచారాన్ని ఫోన్ లో చిత్రీకరించారు. కాసేపటికి ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని తెలుసుకుని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఆస్పత్రి సిబ్బంది గమనించి ఆమెకు వైద్యం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి నుంచి ఆధారాలు సేకరించి అనాస్ ను అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు. తెలియని వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు. ఎవరో తెలియకుండా ఇలా చేస్తే తరువాత విచారించాల్సి వస్తుందని చెబుతున్నారు.