Sudden death of a young man while dancing at the Ganesh Mandapam: ఈ ప్రపంచంలో అన్నింటికంటే విలువైనది ప్రాణం.. దాని తర్వాత డబ్బు , పరపతి.. ఎక్స్ ట్రాలు.. ఆ ప్రాణం ఎప్పుడు పోతుందో.. ఎలా పోతుందో చెప్పలేం.. ఆ దేవుడు మనకు భూమ్మీద నూకలు మిగిలిస్తేనే ఉంటుంది. బతకాలని రాసి పెట్టి ఉంటే ఎంత ప్రమాదమైనా మనల్ని ఏం చేయలేదు. చావాలని రాసి పెట్టి ఉంటే చిటికెలో చనిపోతాం..
అలాంటి షాకింగ్ ఘటన ఒకటి తాజాగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో విషాదం నింపింది. గణేషుడు కొలువుదీరాడు. వాడవాడలా వినాయకులను ప్రతిష్టించి యువకులు, ప్రజలు సందడిగా నవరాత్రులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గుత్తి పట్టణంలోని గౌతమిపురి కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఓ యువకుడు నృత్యం చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు యువకుడు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధరించారు. దీంతో స్నేహితులు అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. నృత్యం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతోనే యువకుడు చనిపోయాడని వైద్యులు తెలిపారు.
యువకుడు డ్యాన్స్ చేస్తున్న వీడియో.. సడెన్ గా చనిపోయిన వైనం ఇప్పుడు వైరల్ అయ్యింది. మృత్యువు ఇలా కూడా కబళిస్తుందా? అని అందరూ వాపోతున్నారు. స్థానిక గణేష్ మండపం వద్ద యువకుడి మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి.