HomeజాతీయంCM Hemant Soren: ముఖ్యమంత్రి అరెస్ట్ కు రంగం సిద్ధం

CM Hemant Soren: ముఖ్యమంత్రి అరెస్ట్ కు రంగం సిద్ధం

CM Hemant Soren: అధికారంలో ఉన్నాం కదా.. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాం కదా.. అడ్డగోలుగా దోచేసి.. తరాలకు సరిపడా దాచేసి.. రాజభోగం అనుభవించే వాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు కనీసం సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను రాష్ట్రంలో అనుమతించని ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. అసాంఘిక శక్తులకు.. దోపిడీదారులకు రక్షణగా నిలిచిన ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. అయితే సాగినన్ని రోజులు బాగానే ఉంటుంది. అదే తిరగబడితే మాత్రం తేడా వస్తుంది. ప్రస్తుతం ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య మంత్రి విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఏకంగా ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది.

ఇంతకీ ఏం జరిగిందంటే

జార్ఖండ్ రాష్ట్రం తెలుసు కదా.. అపారమైన బొగ్గు నిల్వలకు ఆ రాష్ట్రం ఆలవాలం. అయితే ఆ బొగ్గు గనుల కేటాయింపులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఇష్టా రాజ్యంగా వ్యవహరించారు. తనకు సంబంధించిన బంధువులకు ఆ గనులను అప్పగించారు. అంతేకాదు బొగ్గు తవ్వకాల్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారు. ఫిర్యాదులు రావడంతో ఈడి రంగంలోకి దిగింది. కీలక విషయాలను వెలికి తీసింది.. ఇదే సందర్భంలో నేపాల్ నుంచి ఒక మావోయిస్టును తీసుకొచ్చింది. అతడు హేమంత్ సోరెన్ కు ప్రొటెక్షన్ లో ఉన్న డబ్బులు ఇచ్చానని సంచలన విషయం చెప్పాడు. దీంతో ఇందుకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ప్రశ్నించాలని హేమంత్ కు ఈడి పలుమార్లు నోటీసులు జారీ చేసింది. అయితే వీటికి హేమంత్ సరైన సమాధానం చెప్పలేదు. చివరికి విచారణకు కూడా హాజరు కాలేదు.

భార్యను రంగంలోకి దింపాడు

కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చినప్పుడు తన స్థానంలో భార్యను ముఖ్యమంత్రి చేయాలని హేమంత్ అప్పట్లో నిర్ణయించుకున్నాడు. దీనికి సంబంధించి పార్టీలో అంతర్గతంగా కలహాలు కూడా మొదలయ్యాయి. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అవన్నీ సమసి పోయాయి. తిరిగి ఇప్పుడు ఈడి అధికారులు హేమంత్ కు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికీ ఆరుసార్లు నోటీసులు జారీ చేసిన అధికారులు.. చివరి ప్రయత్నం గా ఆయన కార్యాలయానికి వర్తమానం పంపారు. అయినప్పటికీ ఆయననుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో అరెస్టు చేసేందుకు ఒక ఈడి అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ మొత్తం ఒక కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. ఇండియా కూటమిలో హేమంత్ సోరెన్ ని పార్టీ భాగస్వామిగా ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీకి భారత్ జూడో యాత్రకు సహకరించిన ఓ రాజ్యసభ సభ్యుడు ఇంట్లో పన్ను శాఖ అధికారులు సోదాలు చేయగా 250 కోట్ల డబ్బు కట్టలు బయటపడ్డాయి. దీన్ని మర్చిపోకముందే హేమంత్ వ్యవహారం తెరపైకి రావడంతో రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. మరి పార్లమెంట్ ఎన్నికల ముంగిట హేమంత్ అరెస్టు ఉంటుందా? దేన్నైనా లెక్కచేయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హేమంత్ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. అన్నట్లు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ దగ్గరికి ఈ హేమంత్ పలుమార్లు వచ్చాడు. అంతేకాదు ఆ రాష్ట్రానికి కూడా కేసీఆర్ వెళ్లారు. అక్కడ చనిపోయిన సైనికులకు చెక్కులు ఇచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా కెసిఆర్ మార్చారు. ఆ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి హేమంత్ సోరెన్ హాజరు కాలేదు. అంతేకాదు కెసిఆర్ తుంటి ఎముక విరిగి ఆస్పత్రి పాలైనా పరామర్శించలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular