Takkallapalli Ravinder Rao: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంతవరకు భారత రాష్ట్ర సమితి నాయకులు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కడియం శ్రీహరి లాంటివారు ప్రభుత్వం కూలిపోతుందని పనికిమాలిన మాటలు మాట్లాడినప్పటికీ.. ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓటమికి సంబంధించి ఇంతవరకు ఏ ఒక్క నాయకుడు దీని గురించి మాట్లాడలేదు. చివరికి 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఓటమిని ఇప్పటికి అంగీకరించలేదు. చివరికి తన రాజీనామా లేఖను గవర్నర్ కు నేరుగా సమర్పించలేదు. తన ఓఎస్డీ ద్వారా మాత్రమే పంపారు. చివరికి ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా అంగీకరించలేని పరిస్థితిలో భారత రాష్ట్ర సమితి నాయకులు ఉన్నారు. ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితికి చెందిన ఒక ఎమ్మెల్సీ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
ఇంతకీ ఏమన్నారంటే
ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ కు చెందిన ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ సాధనలో ముందుండి నడిచారు. ఆయన సేవలు గుర్తించి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయనకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల బాధ్యతలు అప్పగించారు. అయితే క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలిస్తున్నప్పుడు పలు వాస్తవాలు తెలిసాయి. ఈ విషయాలను అధిష్టానం దృష్టికి ఆయన తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే ఆడుకున్నారు. పైగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిస్థితులు ఆశాజనంగా లేవని చెప్పినప్పటికీ తన మాట వినలేదని రవీందర్రావు శుక్రవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అంతేకాదు మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా శంకర్ నాయక్ గెలవడు అని చెప్పినప్పటికీ ఆయనకే టికెట్ ఇచ్చారని రవీందర్రావు వాపోయారు. ఒక బ్యాచ్ వల్ల పార్టీ మొత్తం ఓడిపోయిందని.. దీనికి అధిష్టానమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రవీందర్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
ఎందుకు పట్టించుకోలేదు
ఎన్నికల సమయంలో 70 నుంచి 80 సీట్లు సాధిస్తామని.. మూడోసారి కూడా అధికారం తమదేనని కెసిఆర్ నుంచి కేటీఆర్ దాకా పదేపదే చెప్పుకోచ్చారు. కేటీఆర్ అయితే కేటీఆర్ అయితే ఎన్నికల సభల్లో కాంగ్రెస్ నాయకుల భరతం పడతానని హెచ్చరించారు. ఇక కొడంగల్ లో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి అంగీ ఊడబీకాలని కెసిఆర్ అనడం అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. పదేళ్లుగా అధికారంలో ఉండటం.. స్థానికంగా ఉన్న నాయకుల వేధింపులు పెరిగిపోవడం.. ఎమ్మెల్యేల ఆకృత్యాలు తారాస్థాయికి చేరడంతో.. సహజంగానే భారత రాష్ట్ర సమితిపై ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. దీనికి తోడు భారత రాష్ట్ర సమితి పెద్దల వ్యవహార శైలి కూడా ప్రజలకు నచ్చలేదు. అనివార్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. అంతిమంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ విషయాలను అధిష్టానం పట్టించుకోలేదని.. అందువల్లే ఓడిపోవాల్సి వచ్చిందని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు అంటున్నారు. ఇప్పటికైనా అధిష్టానం తప్పులపై సమీక్ష నిర్వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరి పార్టీకి వ్యతిరేకంగా రవీందర్ రావు మాట్లాడిన నేపథ్యంలో అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉందని భారత రాష్ట్ర సమితి నాయకులు అభిప్రాయపడుతున్నారు.
View this post on Instagram