https://oktelugu.com/

ఆర్బీఐ సంచలన నిర్ణయం.. హోం లోన్ తీసుకునే వారికి శుభవార్త..?

మన పెద్దలు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇల్లు కట్టడం కానీ పెళ్లి చేయడం కానీ అంత తేలికైన పనులు కావు. రోజురోజుకు పెరుగుతున్న ఖర్చుల వల్ల ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే నేటి తరం యువత నగరాల్లో, పట్టణాల్లో సొంతింటి కలను సాధ్యం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఆర్బీఐ అలా సొంతింటి కలను సాకారం చేసుకోలనుకునేవారికి బ్రహ్మాండమైన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 11, 2020 / 10:23 AM IST
    Follow us on

    మన పెద్దలు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇల్లు కట్టడం కానీ పెళ్లి చేయడం కానీ అంత తేలికైన పనులు కావు. రోజురోజుకు పెరుగుతున్న ఖర్చుల వల్ల ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే నేటి తరం యువత నగరాల్లో, పట్టణాల్లో సొంతింటి కలను సాధ్యం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు.

    ఆర్బీఐ అలా సొంతింటి కలను సాకారం చేసుకోలనుకునేవారికి బ్రహ్మాండమైన శుభవార్త చెప్పింది. ఆర్బీఐ హోం లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే హోం లోన్ తీసుకున్న వారికి, భవిష్యత్తులో హోం లోన్ తీసుకోబోయే వారికి ప్రయోజనం చేకూర్చాలని భావిస్తోంది. బ్యాంకులకు, ఫైనాన్స్ కంపెనీల ద్వారా లోన్లు తీసుకున్న వాళ్లు 30 లక్షల కంటే ఎక్కువ మొత్తం లోన్ తీసుకుంటే ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం కలగనుంది.

    సాధారణంగా హోమ్ లోన్స్ విషయంలో మనం రుణం తీసుకునే మొత్తంపై వడ్డీ ఆధారపడి ఉంటుంది. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 30 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రుణం తీసుకునే వాళ్లకు ప్రస్తుతం 7.25 శాతం వడ్డీరేటును వసూలు చేస్తోంది. 25 లక్షల నుంచి 75 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకునే వాళ్లకు ఈ వడ్డీరేటు అమలు కానుంది. అంతకంటే ఎక్కువ మొత్తం తీసుకున్న వినియోగదారులు 7.35 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

    పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో కూడా 7 శాతం కంటే ఎక్కువ మొత్తం వడ్డీ హోం లోన్ కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆర్బీఐ హోమ్ లోన్స్‌కు ఎల్‌టీవీ ప్రాతిపదికన క్యాపిటల్ రిక్వైర్‌మెంట్ ఆర్బీఐ ఇవ్వనుందని సమాచారం. ఆర్బీఐ నిర్ణయం వల్ల హోం లోన్ తీసుకున్న వారికి భారీగా ప్రయోజనం చేకూరనుంది.